సూపర్ స్టార్.. మెగాస్టార్.. పవర్ స్టార్.. ఐకాన్ స్టార్.. ఇలాంటి మాటలన్నీ దక్షిణాది సినీ రంగంలోనే వింటాం. అగ్ర కథానాయకులను ఇలా పేర్ల ముందు బిరుదులు పెట్టి పిలవడం తక్కువ. బయట అభిమానులైనా షారుఖ్ ఖాన్ ను కింగ్ ఖాన్ అని.. ఆమిర్ ఖాన్ ను మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని పిలుచుకుంటారు కానీ తెరమీద మాత్రం వాళ్ళ పేర్ల ముందర ఇలాంటి బిరుదులేవి పడవు.
ఇలాంటి తరుణంలో యానిమల్ సినిమాలో పేరు ముందు సూపర్ స్టార్ అని వేయించాడు సందీప్ రెడ్డి వంగ. అది బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఒకింత ఆశ్చర్యానికి గురి చేసి ఉంటుంది. కానీ సినిమాలో పర్ఫామెన్స్ చూశాక మాత్రం అతను నిఖార్సైన సూపర్ స్టార్ అని ప్రతి ఒకరికి అనిపిస్తే ఆశ్చర్యం లేదు.
రణబీర్ మంచి పెర్ఫామర్ అనే విషయం బర్ఫీ సహా చాలా సినిమాల్లో రుజువైంది. కానీ లో అతడి పెర్ఫార్మెన్స్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి. ఇంకో 20 ఏళ్ల తర్వాత కూడా రణబీర్ బెస్ట్ పెర్ఫామెన్సెస్ లిస్టు తీస్తే యానిమల్ సినిమాలోనిది ముందు వరుసలో ఉంటుందనడంలో సందేహం లేదు. తన స్క్రీన్ ప్రెజెన్స్ తోనే రణబీర్ సగం మార్కులు కొట్టేశాడు. లుక్స్ పరంగా ట్రాన్స్ఫర్మేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన క్యారెక్టర్లో వివిధ దశల్లో చూపించిన వేరియేషన్ ఆశ్చర్యపరుస్తుంది. ఇక చాలా సీన్లలో తన కళ్ళతోనే అతను భయపెట్టేశాడు.
మామూలుగానే సందీప్ రెడ్డి హీరోని చూస్తేనే భయం కలుగుతుంది. యానిమల్ లో రణబీర్ మరింతగా ప్రేక్షకులను కంగారెత్తించేశాడు. టీనేజీ కుర్రాడిగా మొదలుపెడితే.. 60 ఏళ్ల ముసలివాడిగా కనిపించే వరకు ప్రతి దశలోనూ అతను ఎంతో కన్విన్సింగ్ గా తన పాత్రను పండించి వారెవా అనిపించాడు. అందుకే సినిమాలో కంటెంట్ పరంగా సందీప్ రెడ్డినీ తప్పుపడుతున్నారు కానీ రణబీర్ పెర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం ఎవ్వరు చిన్న నెగిటివ్ కామెంట్ కూడా చేయట్లేదు.
This post was last modified on December 2, 2023 11:33 pm
నందమూరి బాలకృష్ణ తన ప్రతి పుట్టిన రోజుకూ అభిమానులకు సినిమాల పరంగా కానుక ఇస్తుంటాడు. అప్పటికి నటిస్తున్న సినిమా నుంచి…
ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రొటీన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆ మాస్ సినిమాలు కూడా ఎక్కువగా తెలుగు, తమిళం…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…