ఒక్కోసారి సుడి ఉంటే తన్నుకొచ్చే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. దాన్నే ఇంకో రకంగా శుక్రమహర్దశని చెప్పొచ్చు. దిల్ రాజు కంటే మంచి ఉదాహరణ ఇంకోటి అక్కర్లేదు. ‘యానిమల్’ హక్కులను తెలుగు రాష్ట్రాలకు 15 కోట్లకు కొన్నప్పుడు అందరిలోనూ ఒకలాంటి అనుమానం. ఏ మాత్రం తేడా కొట్టినా రన్బీర్ కపూర్ ని మన ఆడియన్స్ తిరస్కరిస్తారు. కట్ చేస్తే మొదటి వీకెండ్ దాటడం ఆలస్యం లాభాలు వచ్చేలా ఉన్నాయి. ముఖ్యంగా నైజామ్ లో యానిమల్ భీభత్సం మాములుగా లేదు. అయితే దిల్ రాజు హవా గత కొంత కాలంగా దివ్యంగా వెలిగిపోతున్న విషయం గమనించాలి .
‘జైలర్’ కీలక ప్రాంతాలకు పంపిణి చేసింది ఆయనే. ఇది కలలో కూడా ఊహించని రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయ్యింది. ఎప్పుడో మార్కెట్ తగ్గిపోయిన రజనీకాంత్ కి తిరిగి తెలుగులో బిజినెస్ పెరిగేలా చేసింది. అంతకు ముందు ‘పొన్నియిన్ సెల్వన్’ రెండు భాగాలు ఇక్కడ అంచనాలు అందుకోలేకపోయినా దిల్ రాజు పెట్టుబడికి ఢోకా లేకుండా వెనక్కు తెచ్చింది. ‘లవ్ టుడే’ని తెలివిగా రీమేక్ చేయకుండా అనువాదం చేయడం లాభాల వర్షం కురిపించింది. ఇవన్నీ స్ట్రెయిట్ సినిమాలు కాదు. ఏ మాత్రం వర్కౌట్ కానీ ‘సప్తసాగరాలు దాటి’ లాంటివి ట్రై చేయకపోవడం దిల్ రాజు తెలివికి నిదర్శనం.
వీటి తాలూకు ఆనందం ఈ అగ్ర నిర్మాతలో స్పష్టంగా కనిపిస్తోంది. గేమ్ చేంజర్ విపరీతంగా ఆలస్యం కావడం, సంక్రాంతికి అనుకున్న ఫ్యామిలీ స్టార్ ని మార్చికి వాయిదా వేయాల్సి రావడం లాంటివి ఇబ్బంది పెట్టినా ఒక డిస్ట్రిబ్యూటర్ గా ఆయన ఫుల్ స్వింగ్ లో ఉన్న మాట వాస్తవం. ఇతర నిర్మాతలు చేసిన మసూద, బింబిసార లాంటి బ్లాక్ బస్టర్లు దిల్ రాజుకు కామధేనువే అయ్యాయి. యానిమల్ ఫైనల్ ఫిగర్స్ మాత్రం ఖచ్చితంగా వామ్మో అనిపించేలా ఉంటాయి. సలార్ కి పోటీ పడకుండా మైత్రికి వదిలేయడం ఎంత వరకు సబబో డిసెంబర్ 22 నాడు తేలిపోతుంది. చూద్దాం.
This post was last modified on December 2, 2023 10:33 pm
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…