స్టార్ యాంకర్ గా టీవీలో వెలిగిపోయే సుడిగాలి సుధీర్ కు క్రమం తప్పకుండా సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. గత ఏడాది గాలోడు అనే ఊర మాస్ బొమ్మలో నటిస్తే ఎంత రొట్ట రొటీన్ గా ఉన్నా సరే నిర్మాతకు మాత్రం డబ్బులు తెచ్చి పెట్టింది. ఆ నమ్మకంతోనే ఇతర ప్రొడ్యూసర్లు తనతో చేతులు కలుపుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న కాలింగ్ సహస్రతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. యానిమల్ పోటీని తట్టుకోవడం కష్టమని తెలిసినా రిస్క్ చేసి మరీ రిలీజ్ చేశారు. ప్రమోషన్లలో సుధీర్ దీని గురించి కాస్త గట్టిగానే చెప్పుకున్నాడు. అయితే ఫైనల్ గా మళ్ళీ నిరాశ మాత్రం తప్పలేదు.
కాన్సెప్ట్ కొంచెం వెరైటీగానే ఉంటుంది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అజయ్ శ్రీవాస్తవ్(సుడిగాలి సుధీర్) ఒక క్లయింట్ కోసం హైదరాబాద్ వస్తాడు. ఓ సందర్భంలో స్వాతి(డాలీషా)ని చూసి ప్రేమిస్తాడు. ఈ క్రమంలో కొత్త సెల్ నెంబర్ తీసుకుంటాడు. అక్కడి నుంచి చిత్ర విచిత్రమైన కాల్స్ సహస్ర పేరుతో రావడం మొదలవుతాయి. కిడ్నాపులు చేసి మనుషులను దారుణంగా హింసించే లూసిఫర్ యాప్ అనే ముఠా గురించి అజయ్ తెలుసుకుంటాడు. దానికి సహస్ర పేరుతో తనకు జరుగుతున్న టార్చర్ కు సంబంధం ఉందని గుర్తిస్తాడు. ఆ తర్వాత అసలు నేరస్థుల దాకా ఎలా వెళ్లాడనేదే స్టోరీ.
శివమణిలో ఎంఎస్ నారాయణ సెల్ ఫోన్ కామెడీని సీరియస్ గా మార్చి, హాలీవుడ్ మూవీ రా సిరీస్ లోని వయొలెన్స్ దీనికి జోడించి, దానికి దెయ్యం థ్రెడ్ కలిపి కథ రాసుకున్నాడు దర్శకుడు అరుణ్ విక్కీరాల. ఏ మాత్రం ఆసక్తి కలిగించని కథా కథనాలతో ఆద్యంతం ఓపికకు పరీక్ష పెట్టేశాడు. సుధీర్ నుంచి సగటు ఫ్యాన్స్ ఆశించే ఎంటర్ టైన్మెంట్, కామెడీ రెండూ లేక కేవలం సస్పెన్స్ ప్లస్ యాక్షన్ కి కట్టుబడటంతో ఈ సిల్లీ లాజిక్స్ లేని కథలో తేలిపోయాడు. ఓపెనింగ్స్ దగ్గరే ఎదురు దెబ్బలు తిన్న సహస్ర కనీసం యావరేజ్ ఉన్నా సుధీర్ కు ఊరట దక్కేది కానీ ఆ ఛాన్స్ పది శాతం కూడా లేదు.
This post was last modified on December 2, 2023 2:43 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…