Movie News

దూత ప్రీమియర్ టాక్ ఏంటి

నిన్న సాయంత్రం నాగచైతన్య డిజిటల్ డెబ్యూ వెబ్ సిరీస్ దూతని హైదరాబాద్ ఏఎంబి మల్టీప్లెక్స్ లో స్పెషల్ ప్రీమియర్ వేశారు. ప్రత్యేకంగా ఆహ్వానించబడిన సెలబ్రిటీలు, కొందరు మీడియా ప్రతినిధులు హాజరయ్యారు. దర్శకుడు విక్రమ్ కె కుమార్ తో పాటు టీమ్ మొత్తం అక్కడే ఉంది. సహజంగానే టాక్ ఎలా ఉందనే కుతూహలం ఫ్యాన్స్ లో కలగడం సహజం. చైతు మొదటిసారి ఓటిటి ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు సినిమా రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టే అమెజాన్ ప్రైమ్ చాలా విస్తృతంగా ప్రమోషన్లు చేయడం బాగా ప్లస్ అవుతోంది.

ఇక టాక్ సంగతి చూస్తే నిన్న చూపించింది కేవలం రెండు ఎపిసోడ్లు మాత్రమే. సాగర్ అనే జర్నలిస్ట్ పాత్రలో క్రాస్ వర్డ్స్ పజిల్స్ మీద విపరీతమైన ఆసక్తి చూపించే క్యారెక్టర్ లో నాగ చైతన్య చాలా కొత్తగా ఉన్నాడు. అధిక శాతం షూట్ రాత్రి, వర్షం ఎఫెక్ట్స్ లో తీయడం వల్ల విభిన్నమైన ఫీలింగ్ కలిగిస్తుంది. ఎపిసోడ్ కొక షాకింగ్ ఎలిమెంట్ తో విక్రమ్ కె కుమార్ చాల ఇంటెన్స్ విజువల్స్ ని ప్రెజెంట్ చేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ కు తీసుకెళ్లే మలుపులు కట్టిపడేసేలా ఉన్నాయి. అయితే ఇంకా బ్యాలన్స్ చాలా ఉంది కాబట్టి బాగుందా బాలేదా అనేది కేవలం దీన్ని బట్టి నిర్ణయించడం కష్టం.

దూత ఇవాళ అర్ధరాత్రి లేదా దానికి కొన్ని గంటల ముందే స్ట్రీమింగ్ జరిగే అవకాశం ఉంది. తండేల్ రెగ్యులర్ షూటింగ్ ని పెండింగ్ లో పెట్టి మరీ ప్రమోట్ చేసుకున్న చైతు దీంతో ఒక కొత్త బ్రేక్ దొరుకుతుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు. కాకపోతే రేపు యానిమల్ హడావిడి ఎక్కువగా ఉంది కాబట్టి దూత వైపు జనాలు మెల్లగా కన్నేసేలా ఉన్నారు. అయినా థియేటర్ మూవీ కాదు కాబట్టి ఎప్పుడు వీలుంటే అప్పుడు తాపీగా చూసే ఛాన్స్ ఉంది. కాన్సెప్ట్ చూస్తుంటే ఎనిమిది ఎపిసోడ్ల మీద ఆసక్తి కలిగేలా విక్రమ్ ప్రెజెంట్ చేశారు. అంచనాలు నిలబెట్టుకుంటే ఫ్యామిలీ మ్యాన్ రేంజ్ లో హిట్టు కొట్టొచ్చు

This post was last modified on November 30, 2023 2:04 pm

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

4 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

6 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

7 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

7 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

7 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

7 hours ago