ఫ్లాపులతో కెరీర్ మొదలుపెట్టి గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తో ఒక్కసారిగా కెరీర్ ని రాకెట్ స్పీడ్ తో పరుగులు పెట్టించిన శృతి హాసన్ ఆ తర్వాత వరసగా మహేష్ బాబు, రవితేజ లాంటి స్టార్లతో జట్టుకట్టి వరస హిట్లను ఖాతాలో వేసుకుంది. అయితే ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. కాటమరాయుడు దెబ్బ గట్టిగానే పడింది. ఆఫర్లు ఆగిపోయాయి. తిరిగి రవితేజ క్రాక్ తో రీ ఎంట్రీ ఇచ్చి మరో మంచి విజయాన్ని సొంతం చేసుకుని కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి రెండు హిట్టు కొట్టాయి. బాగానే ఉంది కానీ ముందులా తనకు అవకాశాలు క్యూ కట్టడం లేదు.
ఇలాంటి ఫేజ్ లో ఒకే నెలలో రెండు టాలీవుడ్ రిలీజులు ఉండటం ఒకరకంగా అదృష్టమే. హాయ్ నాన్న డిసెంబర్ 7 వస్తోంది. ఇందులో మెయిన్ హీరోయిన్ కాదు కానీ కథకు కాస్త ముఖ్యమైన లింక్ ఉన్న స్పెషల్ సాంగ్ తో పాటు క్యామియో లాంటి స్కోప్ ఉందని అంటున్నారు. నిన్న రిలీజ్ చేసిన పాట ఇప్పటిదాకా వచ్చిన ఆల్బమ్ లో బెస్ట్ అనే ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది. దీనికన్నా అసలైన రచ్చ డిసెంబర్ 22 ఉంటుంది. ప్రభాస్ సలార్ లో కథానాయికగా నటించిన శృతి హాసన్ ఇప్పటిదాకా దాని గురించి బయట పెద్దగా మాట్లాడలేదు. టీజర్ టైంలో ట్వీట్ చేయడం తప్ప ఇంకేమి చెప్పలేదు.
దర్శకుడు ప్రశాంత్ నీల్ తన హీరోయిన్లను రెగ్యులర్ స్టైల్ లో పాటల కోసం అన్నట్టు పెట్టడు. డెబ్యూ కన్నడ మూవీ ఉగ్రం, కెజిఎఫ్ రెండింటిలోనూ ఇది గమనించవచ్చు. అయితే సలార్ లో ఎలాంటి క్యారెక్టర్ ఆఫర్ చేశారనేది ఇంకా బయటికి రాలేదు. అసలు ప్రభాస్ కాంబినేషన్ లో ఒక పాటైనా ఉండటం అనుమానమే. కానీ బలమున్న సన్నివేశాలు పడ్డాయట. ప్రమోషన్ ఇంటర్వ్యూలు పెట్టినప్పుడు బయటికి వస్తుందేమో చూడాలి. ఒకవేళ ఈ రెండు కనక హిట్ అయితే శృతి హాసన్ కు మరిన్ని అవకాశాలు క్యూ కడతాయి. లక్కీగా అన్ని సక్సెస్ ఫుల్ మూవీసే పడుతున్న విషయాన్ని ఫ్యాన్స్ నొక్కి చెబుతున్నారు.
This post was last modified on November 29, 2023 7:34 pm
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…