డిసెంబర్ ఏడు, ఎనిమిది తేదీల్లో వరసగా రాబోతున్న హాయ్ నాన్న, ఎక్స్ ట్రాడినరి మ్యాన్ లకు ఊహించని పరిణామాలు తలెత్తుతున్నాయి. ఎప్పుడూ లేనిది తెలుగు రాష్ట్రాల్లో రన్బీర్ కపూర్ డబ్బింగ్ సినిమా సినీ ప్రియులకు వైరల్ ఫీవర్ లా అంటుకుంది. ఇదేదో సోషల్ మీడియా ట్రెండ్స్ చూసి అంటున్న మాట కాదు. బుకింగ్స్ యాప్స్ ఓపెన్ చేసి ఏ ఊరుని సెలెక్ట్ చేసుకుని చూసినా తెల్లవారుఝామున ఆరు గంటల ఆటకు సైతం ఫాస్ట్ ఫిల్లింగ్స్ కనిపిస్తున్నాయి. మూడు గంటల ఇరవై రెండు నిమిషాల సుదీర్ఘ నిడివి ఉన్నా సరే సందీప్ వంగా ఎమోషనల్ ప్రపంచాన్ని చూసేందుకు ఎగబడుతున్నారు.
ఇంత మేనియా ఉండటంతో సహజంగానే నితిన్, నాని సినిమాల మీద అంత ఫోకస్ వెళ్లడం లేదు. హాయ్ నాన్న షూటింగ్ ఎప్పుడో పూర్తయినా ట్రైలర్ చూశాక మాస్ లో ఇది మాకు కాదేమోనని అభిప్రాయం కలగడం బజ్ మీద ప్రభావం చూపిస్తోంది. ఇక ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ కోసం మొన్నటి దాకా షూటింగ్ చేస్తూనే ఉన్న నితిన్ హఠాత్తుగా ప్రమోషన్లు మొదలుపెట్టాడు. ఎంటర్ టైన్మెంట్ ప్లస్ యాక్షన్ రెండూ ఉన్నాయనే భరోసా ఇచ్చారు కానీ దాన్ని జనం దాకా తీసుకెళ్లడానికి సరిపడా టైం నితిన్ దగ్గర లేదు. హీరోయిన్ శ్రీలీల సైతం ఇంకా యాక్టివ్ గా పబ్లిసిటీలో భాగం కావాల్సి ఉంది.
డిసెంబర్ 1 ఉదయం యానిమల్ షో అయ్యాక కానీ రిలాక్స్ అవ్వాలో వద్దో నితిన్, నానిలు నిర్ణయించుకోలేరు. ఎందుకంటే అర్జున్ రెడ్డి టాక్ వస్తే మాత్రం సందీప్ వంగాని నిలువరించడం కష్టం. ఒకవేళ హాయ్ నాన్న, ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ లు దాన్ని మించి ఉన్నాయనిపించుకుంటే అప్పుడు లెక్క వేరుగా ఉంటుంది. ఊరట కలిగించే అంశం ఏమిటంటే యానిమల్ లాగా వీటికి అడల్ట్స్ ఓన్లీ సర్టిఫికెట్ రాదు. సో ఫ్యామిలీస్ ఛాయస్ గా పెట్టుకుంటాయి. అలా అని మాస్, యూత్ మద్దతు దక్కకపోతే కష్టం. చూస్తుంటే ఏడాది చివరి బాక్సాఫీస్ పరిణామాలు చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయి
This post was last modified on November 29, 2023 7:25 pm
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…