ఎప్పుడెప్పుడు ఇరవై నాలుగు రోజులు గడిచిపోతాయా అని ప్రభాస్ ఎదురు చూస్తున్న సలార్ విడుదల దగ్గరగా వస్తోంది. దీనికన్నా ముందు డిసెంబర్ 1న రాబోయే ట్రైలర్ మీద దేశవ్యాప్తంగా కోట్లాది ప్రేక్షకులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్నో నెలల తర్వాత ఒక బాలీవుడ్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని కీలక విషయాలు పంచుకున్నాడు అవేంటో చూద్దాం. సలార్ ఇద్దరు ప్రాణ స్నేహితుల కథ. కలిసి పెరిగిన వీళ్ళు బద్ద శత్రువులుగా మారేందుకు పరిస్థితులు ప్రేరేపిస్తాయి. పార్ట్ వన్ సీజ్ ఫైర్ లో ఫ్రెండ్స్ కి సంబంధించిన సగం కథ మాత్రమే చెప్పబోతున్నారు.
ఇందులోనూ బలమైన ఎమోషన్ ఉంటుంది. నీల్ ఎప్పుడూ యాక్షన్ లో భావోద్వేగాలను రాబట్టుకోలేదు. కథ డిమాండ్ చేసిన ప్రకారం హృదయాన్ని తాకేలా అవసరమైనప్పుడే వాడతారు. అది తల్లి, తమ్ముడు, అన్నయ్య, బంధువు ఇలా ఏ రూపంలో అయినా ఉండొచ్చు. కెజిఎఫ్, సలార్ రెండూ ఒకదానితో మరొకటి సంబంధం లేని ప్రపంచాలు.మొదలైన కాసేపటికే దీని గురించి క్లారిటీ వచ్చేస్తుంది. ట్రైలర్ చూశాక ఒక ఖచ్చితమైన అంచనాకు వచ్చేస్తారు. ప్రభాస్ వ్యక్తిత్వానికి ముగ్దుడు కావడం వల్లే తాను అనుకున్న దానికన్నా గొప్పగా సలార్ ని తెరకెక్కించారట ప్రశాంత్ నీల్.
సెకండ్ పార్ట్ షూటింగ్ వీలైనంత త్వరగా ఉంటుంది కానీ ఖచ్చితంగా ఫలానా డేటు, నెలని చెప్పడం లేదు. దానికి టైం కూడా ఎక్కువ పడుతుంది. ఆరు గంటల సరిపడా సబ్జెక్టు కావడం వల్లే సలార్ ని రెండు భాగాలు చేయాల్సి వచ్చింది తప్ప కేవలం బిజినెస్ కోసమో, క్రేజ్ ని వాడుకోవడం కోసమో కాదట. స్నేహితులుగా నటిస్తున్న ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్ ల మధ్య నడిచే ఎపిసోడ్స్ మాములుగా ఉండవని ఊరిస్తున్నారు. మొత్తానికి ప్రశాంత్ నీల్ చెప్పిన ముచ్చట్లు ఆసక్తి రేపేలా ఉన్నాయి. డంకీ ప్రస్తావన లేకుండా కేవలం సలార్ గురించి మాత్రమే చెప్పిన ఈ గ్రాండియర్ డైరెక్టర్ అంచనాలకు మించి ఏదో చేసేలానే ఉన్నాడు.
This post was last modified on November 28, 2023 9:25 pm
ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి…
శంకర్.. ఒకప్పుడు ఈ పేరు చూసి కోట్లమంది కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవారు. హీరోలు కథ వినకుండానే సినిమా ఒప్పేసుకునేవారు.…
యాదృచ్చికమో లేక కాకతాళీయమో చెప్పలేం కానీ హీరో రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజు మధ్య కాంబో రెండుసార్లు ఒడిదుడుకులకు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి కంకర్యాలు, స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల బాగోగులను పర్యవేక్షఇంచేందుకు ఏర్పాటైనదే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). ఏపీ ప్రభుత్వమే ఈ…
ఇప్పుడంతా టాలీవుడ్ లో సంక్రాంతి హడావిడి నడుస్తోంది. హిట్ టాక్ తో రెండు దూసుకుపోతున్నా బాక్సాఫీస్ డామినేషన్ మాత్రం పూర్తిగా…
తెలుగు మీడియా రంగంలో ఇప్పుడు ఏ పత్రికను చూసినా… ఏ ఛానెల్ ను చూసినా…వాటి వెనుక ఉన్న రాజకీయ పార్టీలు…