టాలీవుడ్ యువ కథానాయకుడు నితిన్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు పెద్ద ఫ్యాన్ అని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తాను సినిమాల్లోకి రావడానికి కారణమే పవన్ అంటాడతను. ‘తొలి ప్రేమ’ చూసి పిచ్చెక్కిపోయి ఎలాగైనా సినిమాల్లోకి రావాలని పంతం పట్టి ఇటు వైపు అడుగులు వేసినట్లు పలు సందర్భాల్లో చెప్పాడు నితిన్. హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్నాక కూడా నితిన్ ఒక సగటు ఫ్యాన్ బాయ్ లాగే వ్యవహరించాడు. తన సినిమాల్లో ఏమాత్రం ఛాన్స్ ఉన్నా పవన్ కళ్యాణ్ రెఫరెన్సులు పెడుతుంటాడు.
ఐతే దీన్ని కేవలం అభిమానం అని కాకుండా.. ‘వాడకం’ అనే వాళ్లు కూడా లేకపోలేదు. తన కొత్త చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’లోనూ నితిన్ పవన్ రెఫరెన్స్ పెట్టాడు. ‘బద్రి’ సినిమాలోని పవన్ గెటప్‌లో నితిన్ ఉన్న పోస్ట్ కూడా ఈ మధ్యే ఒకటి వదిలారు.
ఆల్రెడీ ‘లై’ సినిమాలో ఒకసారి ఇదే గెటప్ వేసిన నితిన్.. ఇంకోసారి ఆ గెటప్ రిపీట్ చేయడంతో ఇదేం వాడకం అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పడ్డాయి. దీని గురించి ఒక ఇంటర్వ్యూలో నితిన్‌కు ప్రశ్న ఎదురైంది. కెరీర్ ఆరంభంలో తమ అభిమాన కథానాయకుడి పేరు వాడుకున్నప్పటికీ.. ఒక స్థాయి వచ్చాక వదిలేస్తారని.. కానీ మీరు మాత్రం మారలేదేంటి.. పవన్ వాడకం శ్రుతి మించుతోందనే కామెంట్లకు ఏమంటారు అని నితిన్‌ను అడిగారు.
దీనికి నితిన్ బదులిస్తూ.. ‘‘నేను అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానిని. ఇది ఎప్పటికీ మారదు. నేను ఏ స్థాయికి వెళ్లినా కూడా సగటు అభిమాని లాగే ఉంటాను. ఆయన మీద ఉన్నఅభిమానాన్ని ఇలాగే చూపిస్తాను. ఎప్పుడైనా నాది ఒకటే మాట. కొందరు కెరీర్ ఆరంభంలో ఒక హీరోకు ఫ్యాన్స్ అంటారు. తర్వాత తమ రేంజ్ పెరిగిందని ఆ మాట చెప్పరు. కానీ నేను ఎప్పుడూ ఇలాగే ఉంటా. ‘ఎక్స్‌ట్రా’ సినిమాలో పవన్ కళ్యాణ్ గెటప్ ఊరికే వేయలేదు. అందులో ఒక సన్నివేశంలో అవసరం పడి ఆ గెటప్ వేశాను. ఎవరేమన్నా నేను కళ్యాణ్ గారికి ఒక ఫ్యాన్‌గా ఇలాగే ఉంటాను’’ అని నితిన్ తేల్చి చెప్పాడు.
This post was last modified on November 28, 2023 2:27 pm
వరల్డ్ ఎకనమిక్ ఫోరం 55వ వార్షిక సదస్సులు సోమవారం దావోప్ లో ప్రారంభం కానున్నాయి. దాదాపుగా విశ్వవ్యాప్తంగా ఉన్న అన్ని…
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో అనేక రికార్డు మెగాస్టార్ చిరంజీవి పేరు మీదే ఉన్నాయి. ఒకప్పుడు ఆయన చూసిన వైభవమే వేరు.…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానానికి చెడిందా? ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు మైలేజీ పొందలేక, పదేళ్ల పాటు అధికారానికి…
సీనియర్ నటుడు నరేష్ వ్యక్తిగత జీవితం గురించి కొన్నేళ్ల ముందు ఎంత గొడవ జరిగిందో తెలిసిందే. తెలుగు సినిమాల్లో బిజీ…
గౌతమ్ మీనన్.. గత పాతికేళ్లలో సౌత్ ఇండియా నుంచి వచ్చిన గ్రేట్ డైరెక్టర్లలో ఒకడు. కాక్క కాక్క, ఏమాయ చేసావె,…
ప్రభుత్వం తరఫున పనులు పూర్తి కావాలంటే రోజులు వారాలే కాదు.. నెలలు సంవత్సరాల సమయం కూడా పడుతుంది. అనేక మంది…