హరిహర వీరమల్లు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఎగ్జైట్ చేసిన సినిమా ఇది. పవన్ తన స్టామినాకు తగ్గ సినిమా చేయట్లేదని ఫీలయ్యే అభిమానులకు.. ఇది ఒక ఆశాదీపం లాగా కనిపించింది. క్రిష్ లాంటి అభిరుచి ఉన్న దర్శకుడు, పవన్ ఫేవరెట్ ప్రొడ్యూసర్ అయిన ఎ.ఎం.రత్నం కలిసి ఈ సినిమాను పట్టాలెక్కించడంతో దీని గురించి ఎంతో ఊహించుకున్నారు. కానీ రకరకాల కారణాల వల్ల ఆ చిత్రానికి బ్రేక్ పడింది. మళ్లీ ఆ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందో, ఎప్పటికి పూర్తయి ప్రేక్షకుల ముందుకు వస్తుందో క్లారిటీ లేదు.
కానీ ఎప్పుడు ఆ సినిమా ప్రస్తావన వచ్చినా అభిమానులు ఎగ్జైట్ అవుతుంటారు. ఈ మధ్య పవన్ పుట్టిన రోజుకు ఒక మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తే దానికి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ తర్వాత ‘హరిహర వీరమల్లు’ వార్తల్లో లేదు.
కట్ చేస్తే ఇప్పుడు ‘యానిమల్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ‘హరిహర వీరమల్లు’ ప్రస్తావన రావడంతో ఆడిటోరియం హోరెత్తింది. ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్న బాబీ డియోల్‌తో యాంకర్ సుమ చిట్ చాట్ జరిపింది. ఈ సందర్భంగా తెలుగు సినిమాలతో తన అనుబంధం గురించి మాట్లాడుతూ, ‘హరిహర వీరమల్లు’ పేరెత్తకుండా ఆ చిత్రంలో తానొక ప్రత్యేకమైన పాత్ర పోషించానని చెప్పాడు. అందులో తనకొక డైలాగ్ గుర్తుంది అంటూ.. ఆడిటోరియం హోరెత్తుతుండగా.. “బాద్‌షా బేగం మా ప్రాణం. మా ప్రాణాలు కాపాడావు. మీకేం కావాలో కోరుకోమని ఆదేశిస్తున్నాను” అని డైలాగ్ చెప్పాడు బాబీ డియోల్. ముందు రోజు ‘యానిమల్’ ప్రెస్ మీట్లోనూ ‘హరిహర వీరమల్లు’ ప్రస్తావన తెచ్చాడు బాబీ. తాను తెలుగులో ఒక సినిమాలో నటిస్తున్నానని.. అది సగం పూర్తయ్యాక మధ్యలో ఆగిపోయిందని.. ఇప్పుడు ఇంకో సినిమా చేయబోతున్నానని బాలయ్య-బాబీ చిత్రాన్ని రెఫర్ చేశాడు బాబీ డియోల్.
This post was last modified on November 28, 2023 2:21 pm
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…