ఈ శుక్రవారం విడుదల కాబోతున్న యానిమల్ బజ్ కు హద్దులు లేకుండా పోతోంది. హైదరాబాద్, ముంబై లాంటి నగరాలంటే ఏమో అనుకోవచ్చు. కానీ గుంటూరు, కర్నూలు లాంటి జిల్లా కేంద్రాల్లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ అది కూడా ఉదయం ఏడు గంటల ఆటకు ఫాస్ట్ ఫిల్లింగ్ లో ఉండటం షాక్ కలిగించే విషయం. ప్రమోషన్లకి ఇంకాస్త జోరు అందించేందుకు మల్లారెడ్డి కాలేజీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్న టీమ్ దానికన్నా ముందు తెలుగు మీడియాతో ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించింది. అందులో భాగంగా మహేష్ బాబుకి చెప్పిన కథ ప్రస్తావన మరోసారి వచ్చింది.
సూపర్ స్టార్ కి తాను స్టోరీ చెప్పానని, అయితే అది యానిమల్ కి మించిన వయొలెంట్ క్యారెక్టరైజేషన్ తో డెవిల్ లా ఉంటుందని, కానీ కొన్ని కారణాల వల్ల మహేష్ కి అంతగా నచ్చక కార్యరూపం దాల్చలేదని చెప్పాడు. ఇది విని అభిమానులు ఎంత తల్లడిల్లుతారో వేరే చెప్పనక్కర్లేదు. ఇంత అగ్రెసివ్ హీరోయిజం చూపించే దర్శకుల్లో సందీప్ వంగాది ప్రత్యేక స్థానం. ఒకవేళ నిజంగా ఈ కాంబో కుదిరి ఉంటే ప్యాన్ ఇండియా లెవెల్లో ఏ రేంజ్ బాక్సాఫీస్ ఊచకోత ఉండేదో ఊహించుకోవచ్చు. పైగా 1 నేనొక్కడినే తర్వాత మహేష్ అంత ఇంటెన్స్ పాత్రలు తిరిగి చేయలేదు.
దగ్గరలో సాధ్యపడదు కానీ సందీప్ వంగా ప్రభాస్ స్పిరిట్. అల్లు అర్జున్ సినిమాలు చేశాక ఏమైనా మళ్ళీ ట్రై చేస్తాడేమో చూడాలి. అతని లిస్టులో రామ్ చరణ్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు కూడా ఉన్నారు. ఇంకోవైపు టి సిరీస్ సంస్థ ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని టాలీవుడ్ కు పంపించేందుకు సిద్ధంగా లేదు. ఎలాగైనా సరే వరస సినిమాలతో ముంబైలో కట్టేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. యానిమల్ 2 కూడా ఉంటుందనే హింట్ నిర్మాత భూషణ్ కుమార్ హింట్ ఇచ్చారు కానీ డిసెంబర్ 1 తెరమీద చూడమని చెప్పారు. రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్ లు ఈ ప్రెస్ మీట్ లో భాగమయ్యారు.
This post was last modified on November 27, 2023 7:49 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…