గత ఏడాది మాచర్ల నియోజకవర్గంతో చేదు ఫలితాన్ని అందుకున్న యూత్ హీరో నితిన్ ఈసారి మళ్ళీ తన పాత రూటుకే వచ్చి ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ గా వస్తున్నాడు. భీష్మ లాంటి వినోదాత్మక చిత్రాన్ని ఆభిమానులు ఆశిస్తున్న తరుణంలో సరైన కథను ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. రచయితగా స్టార్ స్టేటస్ లో ఉన్న వక్కంతం వంశీకి దర్శకుడిగా నా పేరు సూర్య ఆశించిన రిజల్ట్ ఇవ్వలేకపోయినా ఈసారి బాగా టైం తీసుకుని వినోదం ప్లస్ యాక్షన్ వైపుకు వచ్చేశాడు. హీరోయిన్ శ్రీలీల గ్లామర్ అట్రాక్షన్. ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ వేదికగా ట్రైలర్ లాంచ్ నిర్వహించారు.
అభి(నితిన్)కి చిన్నప్పటి నుంచి రోజుకోలాగా కనిపించాలని కోరిక. అదే తల్లి(రోహిణి)తో చెబుతాడు. కొడుకులో యాక్టర్ లక్షణాలున్నాయని గుర్తించి హీరో కమ్మని ప్రోత్సహిస్తుంది. తీరా చూస్తే మనోడు జూనియర్ ఆర్టిస్టు అవుతాడు. రకరకాల గెటప్పులతో లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే తండ్రి(రావు రమేష్)కి ఎక్కడో కాలుతుంది.జీవితంలో ఏదో ఛాలెంజ్ కావాలని అభి ఎదురు చూస్తున్న టైంలో ఒక ఊరు, దాన్ని పట్టి పీడిస్తున్న ఒక విలన్(సుదేవ్ నాయర్) ప్రవేశిస్తారు. అక్కడి నుంచి రియల్ డ్రామా మొదలవుతుంది. అసలైన ప్రమాదంలో అడుగు పెట్టిన అభి చివరికి ఏం చేశాడో తెరమీద చూడాలి.
దర్శకుడు వక్కంతం వంశీ మంచి వినోదాత్మక రూటు పట్టేశాడు. సన్నివేశాల్లో ట్రెండ్ కు తగ్గ ఫన్ ఉంది. పాదయాత్ర అంటూ షర్మిల చెప్పిన డైలాగ్ ని మిమిక్రి చేయడం, ఫ్యాన్స్ ని బాలయ్య ఎందుకు కొడతాడంటే వెరైటీ సమాధానం చెప్పడం లాంటి బాగా పేలాయి. యాక్షన్ టచ్ కోసం విలన్ ట్రాక్ పెట్టి ఫక్తు రేసు గుర్రం టైపులో ఫుల్ మీల్స్ ప్లాన్ చేసుకున్నాడు వంశీ. హరీష్ జైరాజ్ సంగీతం, ఆర్థర్ విల్సన్ – యువరాజ్ – సాయిశ్రీరామ్ ఛాయాగ్రహణం నిర్వర్తించారు. డిసెంబర్ 8కి సరిపడా హైప్ ని ఎక్స్ ట్రాడినరీగా సృష్టించుకోవడంలో టీమ్ విజయవంతమయ్యింది.చివర్లో రాజశేఖర్ పంచ్ కామెడీ బాగుంది.
This post was last modified on November 27, 2023 5:52 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…