ఇండస్ట్రీలో సినిమాలు వేగంగా చేసే విషయంలో ముందు వరసలో ఉన్నది రవితేజ, నానిలే. జయాపజయాలెలాగూ మన చేతుల్లో ఉండవు కాబట్టి వీలైనంత బిజీగా ఉంటూ యూనిట్లకు పని కల్పించడంలో ముందుంటారు. డిసెంబర్ 7 హాయ్ నాన్న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. కూతురు సెంటిమెంట్ తో రూపొందిన ఈ ఎమోషనల్ మూవీ మీద ఫ్యామిలీ ఆడియన్స్ కి భారీ అంచనాలున్నాయి. ఇది పూర్తి కావడం ఆలస్యం వివేక్ ఆత్రేయతో సరిపోలేదా శనివారం మొదలైంది. చిన్న బ్రేక్ ఇచ్చారు కానీ డిసెంబర్ రెండో వారం తర్వాత ఏకధాటిగా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు.
దీని తర్వాత తమిళ దర్శకుడు సిబి చక్రవర్తి ప్రాజెక్ట్ మొదలవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి లేదా మార్చ్ లో మొదలుపెట్టే ఛాన్స్ ఉంది. సంక్రాంతికి సైంధవ్ రిలీజయ్యాక హిట్ 3 ది థర్డ్ కేస్ పనిలో ఉంటాడు దర్శకుడు శైలేష్ కొలను. లైన్ ఆల్రెడీ లాక్ అయ్యిందని, ఫైనల్ వెర్షన్ రెడీ చేయాల్సి ఉందని ఇన్ సైడ్ టాక్. క్యారెక్టర్ తాలూకు హింట్ ని అడవి శేష్ హిట్ 2 క్లైమాక్స్ లో ఆల్రెడీ ఇచ్చేశారు కాబట్టి దానికి అనుగుణంగానే ఈ కథ ఉంటుంది. అఫీషియల్ అనౌన్స్ మెంట్ జనవరి లేదా ఫిబ్రవరిలో రావొచ్చు.
వీటి తర్వాత దసరాతో మాస్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలకు మరో ఛాన్స్ ఇవ్వబోతున్నాడు నాని. ఇది యాక్షన్ ఎంటర్ టైనరే. తిరుమల సందర్శనకు వచ్చిన దర్శకుడు క్లారిటీ ఇవ్వడంతో ఇది కూడా సెట్ అయిపోయినట్టే. మరో రెండు చర్చల దశలో ఉన్నాయి వాటి పేర్లు బయటికి రాకుండా నాని టీమ్ జాగ్రత్త పడుతోంది. హాయ్ నాన్న ఫలితాన్ని బట్టి హెవీ ఎమోషన్ ఉన్న కథలను ఎంచుకోవడం మీద నాని ఒక నిర్ణయం తీసుకోవచ్చని తెలిసింది. ఎంటర్ టైన్మెంట్, యాక్షన్ ఈ రెండు ప్రాధాన్యంగా పెట్టుకుని కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే స్క్రిప్టుతో ఎవరు వచ్చినా నాని గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.
This post was last modified on November 27, 2023 11:03 am
బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ…
హారర్ కామెడీ జానర్లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల…
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…