Movie News

యానిమ‌ల్ షోలు.. థియేట‌ర్ల అడ్జ‌స్ట్‌మెంట్లు

ఈ రోజుల్లో 3 గంట‌ల సినిమాలే అరుదు. అలాంటిది వ‌చ్చే శుక్ర‌వారం ఏకంగా 3 గంట‌ల 21 నిమిషాల నిడివితో ఓ సినిమా రాబోతోంది. అదేమీ ఆషామాషీ సినిమా కాదు. అర్జున్ రెడ్డి ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగ‌.. బాలీవుడ్ సూప‌ర్ స్టార్ ర‌ణ‌బీర్ క‌పూర్‌ల క్రేజీ కాంబినేష‌న్లో తెర‌కెక్కిన యానిమ‌ల్.

ఈ సినిమాపై ఉన్న అంచ‌నాల సంగ‌తి తెలిసిందే. యానిమ‌ల్ ర‌న్ టైం గురించి జ‌రుగుతున్న ప్ర‌చార‌మే నిజ‌మై భారీ నిడివితో సినిమా రిలీజ్ కాబోతోంది. రెండు-రెండున్న‌ర గంట‌ల సినిమాల‌కు అల‌వాటు ప‌డ్డ ప్రేక్ష‌కులు, థియేట‌ర్ల యాజ‌మాన్యాలు యానిమ‌ల్ కోసం స‌ర్దుబాట్లు చేసుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఓ లెంగ్తీ సినిమా చూడ్డానికి ప్రేక్ష‌కులు ప్రిపేరై రావాలి. ఇక థియేట‌ర్లు కూడా షోల షెడ్యూలింగ్ ప‌రంగా స‌ర్దుబాట్లు చేసుకోక త‌ప్ప‌ట్లేదు.

రెగ్యుల‌ర్ షోల టైం ప్ర‌కార‌మే యానిమ‌ల్ షోలు వేయ‌డానికి అవ‌కాశం లేదు. అలా చేస్తే నాలుగు షోలు పూర్త‌య్యేస‌రికి అర్ధ‌రాత్రి 2 దాటుతుంది. అందుకే మామూలుగా 11 త‌ర్వాత మొద‌ల‌య్యే మార్నింగ్ షోల‌ను ఉద‌యం 10-10.30 మ‌ధ్య మొద‌లుపెడుతున్నాయి థియేట‌ర్లు. అందుకు అనుగుణంగానే త‌ర్వాతి షోలు కూడా ప్లాన్ చేసుకోవాల్సి వ‌స్తోంది. ఈ సినిమాకు దేశ‌వ్యాప్తంగా అనేక చోట్ల అర్లీ మార్నింగ్ షోలు ప‌డ‌బోతున్నాయి.

ఐదు షోలు వేయాల‌నుకుంటే ఉద‌యం 7 గంట‌ల‌కు అటు ఇటుగా షోలు మొద‌లు పెట్టేయాల్సిందే. లెంగ్తీ ర‌న్ టైం వ‌ల్ల థియేట‌ర్ల‌కు భారం త‌ప్ప‌దు. క‌రెంట్ స‌హా అన్ని ర‌కాల ఖ‌ర్చులూ పెర‌గ‌నున్నాయి. ఐతే సినిమాకు మంచి క్రేజ్ ఉండ‌డంతో ఇక్క‌డ కొంచెం లాస్ ఉన్న‌ప్ప‌టికీ.. వ‌సూళ్ల రూపంలో అదంతా క‌వ‌ర్ అయిపోతుంద‌న‌డంలో సందేహం లేదు. డిసెంబ‌రు 1న యానిమ‌ల్ ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే.

This post was last modified on November 26, 2023 7:28 am

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

6 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

8 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

8 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

9 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

11 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

12 hours ago