మలయాళ సినీ పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత డిమాండ్ ఉన్న క్యారెక్టర్ నటుడంటే జోజు జార్జ్‌యే. భారీ అవతారంలో కనిపించే ఆయన్ని మామూలుగా చూస్తే ఏముంది ప్రత్యేకత అనిపిస్తుంది. కానీ జార్జ్ నటించిన సినిమాలు కొన్ని చూస్తే ఆయనకు ఫ్యాన్ అయిపోతాం. రాజశేఖర్ ‘శేఖర్’గా రీమేక్ చేసిన ‘జోసెఫ్’ కావచ్చు.. ‘కోటబొమ్మాళి పీఎస్’గా రీమేక్ అయిన ‘నాయట్టు’ కావచ్చు.. ‘ఇరట్టు’ అనే ఇంకో సెన్సేషనల్ థ్రిల్లర్ కావచ్చు.. ఆయా చిత్రాల్లో జార్జ్ పోషించిన పాత్రలు.. ఆయన నటన చూసి వావ్ అనకుండా ఉండలేం.
తమిళంలో ధనుష్ హీరోగా తెరకెక్కిన ‘జగమేతంత్రం’ ఫ్లాప్ అయి ఉండొచ్చు కానీ.. అందులో కూడా జార్జ్ పాత్ర, తన నటన స్పెషల్‌గా అనిపిస్తాయి. అలాంటి నటుడు తెలుగులో ఎంట్రీ ఇస్తున్నాడంటే తన గురించి తెలిసిన వాళ్లందరూ ఎగ్జైట్ అయ్యారు.
ఐతే శుక్రవారం రిలీజైన జార్జ్ తెలుగు డెబ్యూ మూవీ ‘ఆదికేశవ’ చూశాక అందరి ఆశలు నీరుగారిపోయాయి. జార్జ్ స్థాయికి ఏమాత్రం తగని పాత్ర ఇచ్చాడు కొత్త దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి. ఇలాంటి ఫ్యాక్షనిస్టు పాత్రలు లెక్కలేనన్ని వచ్చాయి తెలుగులో. సినిమా మొత్తంలో జార్జ్ నట కౌశలాన్ని చూపించే ఒక్క సీన్ లేదు. ఆ పాత్రలో ఏ అనామక నటుడు ఉన్నా కూడా ఓకే అన్నట్లుగా సాగింది.
జార్జ్ కూడా ఈ క్యారెక్టర్‌ను చాలా మొక్కుబడిగా చేసుకుపోయినట్లు అనిపించింది. సినిమా మొత్తంలో మినిమం ఇంపాక్ట్ లేకుండా జార్జ్ చేసిన పాత్ర తన కెరీర్లో ఇదే కావచ్చు. ఈ మాత్రం దానికి జార్జ్‌ను ఏరికోరి ఎందుకు ఎంచుకున్నారన్నది అర్థం కాని విషయం. ఈ సినిమా కథ.. కథనం అన్నీ కూడా పరమ రొటీన్‌గా సాగిపోవడంతో ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు తప్పట్లేదు. వైష్ణవ్ తేజ్ కెరీర్‌కు పెద్ద బ్రేక్ వేసేలా కనిపిస్తోంది ‘ఆదికేశవ’.
This post was last modified on November 25, 2023 4:28 pm
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…