బాలీవుడ్లో డేటింగ్‌లు, ఎఫైర్లు, బ్రేకప్‌లు సర్వ సాధారణమైన విషయాలు. ఇలాంటి వాటిలో భాగస్వామ్యం కాని హీరో హీరోయిన్లు చాలా అరుదుగా ఉంటారు. అక్కడ మరీ దాపరికాలు కూడా ఏమీ ఉండవు. చాలా వరకు ఓపెన్‌గానే ఉంటారు. టాక్ షోల్లో ఎఫైర్లు, బ్రేకప్‌ల గురించి చాలా క్యాజువల్‌గా మాట్లాడేస్తుంటారు. ముఖ్యంగా కరణ్ జోహార్ హోస్ట్ చేసే ‘కాఫీ విత్ కరణ్’ షోలో చర్చలన్నీ వీటి గురించే ఉంటాయి. ఈ షో పాపులారిటీ కూడా ఇలాంటి టాపిక్స్ మీదే ఆధారపడి ఉంటుంది.
ఇటీవల ఇదే షోలో తన భర్త రణ్వీర్ సింగ్ పక్కనుండగా దీపికా పదుకొనే తన పాత రిలేషన్‌షిప్స్ గురించి చెప్పిన మాటలు పెద్ద దుమారమే రేపాయి. తాజాగా సారా అలీ ఖాన్, అనన్య పాండే కలిసి పాల్గొన్న ఎపిసోడ్‌లోనూ రిలేషన్‌షిప్స్ మీద చర్చ జరిగింది. తమ ఇద్దరికీ కామన్ ‘ఎక్స్’ ఉన్నాడంటూ వీళ్లిద్దరూ ఈ షోలో ఒప్పుకోవడం చర్చనీయాంశం అయింది.
ఐతే ఒక వ్యక్తితో వేర్వేరు సమయాల్లో తాము డేటింగ్‌లో ఉన్నట్లు సారా, అనన్య చెప్పారు. ఆ వ్యక్తి పేరు చెప్పకపోయినా.. అది కార్తీక్ ఆర్యన్ అనే విషయం అందరికీ అర్థమైపోయింది. కాగా మాజీ బాయ్‌ఫ్రెండ్‌తో ఫ్రెండ్‌గా ఉండటం సాధ్యమా అని కరణ్ జోహార్ అడగ్గా.. దానికి బదులిస్తూ అదంత సులువు కాదని సారా చెప్పింది. ఒక రిలేషన్‌షిప్ కచ్చితంగా మనుషుల మీద ప్రభావం చూపుతుందని.. దాని తర్వాత మళ్లీ క్యాజువల్‌గా, ఫ్రెండ్‌గా ఉండటం చాలా కష్టమని ఆమె అంది. ప్రతి రిలేషన్‌షిప్ మనకు కొన్ని పాఠాలు నేర్పుతుందని ఆమె వ్యాఖ్యానించింది.
ఐతే సారా మరీ అభ్యంతరకరంగా ఏమీ మాట్లాడకపోయినా.. కార్తీక్‌కు ఇది నచ్చలేదు. తాను ఎప్పడూ ముగిసిన రిలేషన్‌షిప్స్ గురించి ఎక్కడా మాట్లాడలేదని.. వ్యక్తిగత విషయాల గురించి పబ్లిక్ ఫ్లాట్‌ఫామ్స్ మీద మాట్లాడటం తనకు నచ్చదని అతనన్నాడు. సారా ఇలా ఓపెన్‌గా తమ రిలేషన్‌షిప్ గురించి మాట్లాడటం తనకు నచ్చలేదని అతను కుండబద్దలు కొట్టేశాడు.
This post was last modified on November 22, 2023 7:41 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…