క్రిస్మస్‌కు ఇండియన్ బాక్సాఫీస్ షేకైపోవడం ఖాయం. ఆల్రెడీ ‘డంకీ’ లాంటి పెద్ద సినిమా ఆ పండక్కి రాబోతుండగా.. ‘సలార్’ సైతం అదే సీజన్‌ను ఎంచుకుంది. ఈ రెంటిలో ఏదో ఒకటి వాయిదా పడుతుందని ఒక దశలో ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ ఉండదని తేలిపోయింది. రెండు చిత్ర బృందాలూ క్రిస్మస్ రిలీజ్ దిశగా సన్నాహాలను వేగవంతం చేశాయి. బిజినెస్ పూర్తి చేసి.. స్క్రీన్ల బుకింగ్ మీద దృష్టిపెట్టాయి. విడుదలకు ఇంకో నెల రోజులే ఉండడంతో యుఎస్ సహా కొన్ని దేశాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలైపోయాయి.
ఇండియా వరకు ‘డంకీ’ మీద ‘సలార్’ ఆధిపత్యం ఉంటుందన్నది ముందు నుంచి ఉన్న అంచనానే. ఐతే ఓవర్సీస్‌లో ‘సలార్’కు ‘డంకీ’ దీటుగా నిలుస్తుందని.. డామినేట్ చేసినా ఆశ్చర్యం లేదని బాలీవుడ్ ట్రేడ్ పండిట్లు అభిప్రాయాలు వ్యక్తం చేశారు ఇంతకుముందు. కానీ వాస్తవ పరిస్థితి అలా కనిపించడం లేదు.
యుఎస్‌లో ఇప్పటిదాకా జరిగిన ప్రి సేల్స్‌లో అయితే ‘సలార్’ పూర్తిగా డామినేట్ చేస్తోంది. ఇప్పటికే యుఎస్‌లో ‘సలార్’కు సంబంధించి 500కు పైగా షోలకు ప్రి సేల్స్ మొదలయ్యాయి. వాటి ద్వారా ఆల్రెడీ 1.30 లక్షల డాలర్లకు పైగా కలెక్ట్ చేసింది ‘సలార్’. నెల రోజుల ముందే ఈ ఊపు చూసి షాకవుతున్నారు ట్రేడ్ పండిట్స్. ఇప్పటికే 5 వేలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఇదే సమయంలో ‘డంకీ’ ఊపేమీ కనిపించలేదు. వంద లోపే షోలకు ప్రి సేల్స్ మొదలు కాగా కలెక్షన్ వేల డాలర్లలోనే ఉంది. ఈ సినిమా టికెట్ల కోసం జనం ఏమీ ఎగబడట్లేదు. రిలీజ్ దగ్గర పడ్డాక ఏమైనా ఊపు పెరుగుతుందేమో చూడాలి.
కాగా డిసెంబరు 1న రిలీజయ్యే ‘యానిమల్’కు మాత్రం మంచి క్రేజ్ కనిపిస్తోంది. ఆ సినిమా ఇప్పటికే 55 వేల డాలర్లు కలెక్ట్ చేసింది. కానీ ఇంకో మూడు వారాలు లేటుగా రిలీజయ్యే ‘సలార్’కే దాని కంటే ఎక్కువ ఊపు కనిపిస్తోంది. దీన్ని బట్టే ప్రభాస్ సినిమాకున్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on November 22, 2023 7:22 pm
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…