మూణ్నాలుగు రోజులుగా కోలీవుడ్ చర్చలన్నీ సీనియర్ నటుడు మన్సూర్ అలీఖాన్ చుట్టూనే తిరుగుతున్నాయి. గతంలో ఎన్నోసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మన్సూర్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, లియో సినిమాలో తనకు త్రిషకు మధ్య కాంబినేషన్ సీన్లు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. త్రిషతో కలిసి సినిమా చేస్తున్నానంటే.. ఆమెతో రేప్ సీన్లు ఉంటాయని ఆశించానని.. కానీ అలాంటివేమీ దర్శకుడు పెట్టలేదని అతనన్నాడు.
ఈ వ్యాఖ్యల మీద తీవ్ర దుమారమే రేగింది. స్వయంగా త్రిషనే ఈ వ్యాఖ్యలను తప్పుబడుతూ పోస్టు పెట్టింది. లియో దర్శకుడు లోకేష్ కనకరాజ్.. ఇంకా ఎంతోమంది సెలబ్రెటీలు మన్సూర్ వ్యాఖ్యలను ఖండించారు. ఇండస్ట్రీలో ఈ విషయం తీవ్ర దుమారం రేపడంతో నడిగర్ సంఘం.. మన్సూర్ మీద సస్పెన్షన్ కూడా విధించింది. ఐతే ఇంత జరిగినా మన్సూర్‌లో అసలు పశ్చాత్తాప భావమే కనిపించకపోవడం ఆశ్చర్యకరం.
తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని.. వాటిని వక్రీకరించారని ఇప్పటికే ఓ వివరణ ఇచ్చిన మన్సూర్.. తాజాగా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. అందులో మాట్లాడుతూ.. తాను ఎవ్వరికీ క్షమాపణ చెప్పబోనని తేల్చేశాడు. తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నట్లుగా అతను మాట్లాడాడు. నడిగర్ సంఘం తనపై సస్పెన్షన్ విధించడాన్ని అతను తప్పుబట్టాడు.
ఈ విషయమై ఎవరినీ విచారించకుండానే నిర్ణయం తీసుకున్నారని.. వాళ్లు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి నాలుగు గంటల సమయం ఇస్తున్నట్లు చెబుతూ అతను అల్లిమేటం విధించడం గమనార్హం. మీడియా వాళ్లు తనను ప్రశ్నలు అడుగుతుంటే.. జనగణమన పాడేసి వెళ్లిపోవడం గమనార్హం. మన్సూర్ ప్రవర్తనతో అతడిపై విమర్శల జడి ఇంకా పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం మన్సూర్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన సంగతి తెలిసిందే.
This post was last modified on November 21, 2023 5:03 pm
టాలీవుడ్లో యువ కథానాయకులు ఒక్కొక్కరుగా పెళ్లి వైపు అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో అల్లు శిరీష్ వివాహం చేసుకున్న…
భారీ ప్యాన్ ఇండియా మూవీ, ఇమేజ్ ఉన్న స్టార్ హీరో అని కథ పూర్తిగా వినకుండా, జల్లెడ పట్టకుండా తొందరపడితే…
సుప్రీం కోర్టు తీర్పుతో మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.…
తమ స్వంత ప్రమేయం లేకుండా ఎవరి వల్లనో ఇబ్బందులు, కష్టాలు పడాల్సి వస్తే ఆ బాధ మాములుగా ఉండదు. ఇట్లు…
కెజిఎఫ్, సలార్ రూపంలో తనకంటూ కల్ట్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. తను డైరెక్ట్ చేయకపోయినా కేవలం కథను…
225 పరుగులు చేసినా న్యూజిలాండ్‌కు విజయం దక్కలేదు. టీమ్ఇండియా మరో రెండు బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను ఛేదించింది. అయితే…