ఆరేళ్ళకు పైగా నిర్మాణంలో ఉన్న విక్రమ్ నటించిన ‘ధృవ నక్షత్రం చాఫ్టర్ 1 యుద్ధకాండం’ విడుదల ఈ శుక్రవారం 24న జరగాల్సి ఉంది. ఈ మేరకు ప్రకటనలు, ట్రైలర్ గట్రా వచ్చేశాయి. అయితే గత కొద్దిరోజులుగా టీమ్ మౌనంగా ఉండటం, విక్రమ్ అసలు దీని గురించే పట్టనట్టు దూరంగా జరగడం పలు అనుమానాలకు తెరతీస్తోంది. ట్రేడ్ నుంచి వస్తున్న సమాచారం మేరకు నిర్మాత కం దర్శకుడు గౌతమ్ మీనన్ ఫైనాన్షియర్లకు సెటిల్ చేయాల్సిన మొత్తం యాభై కోట్ల దాకా ఉందట. అది ఇస్తే తప్ప క్లియరెన్స్ రాదు. తన మార్గాలన్నీ తవ్వుతున్న గౌతమ్ మీద విపరీతమైన ఒత్తిడి ఉంది.
చూస్తుంటే ధృవ నక్షత్రం మళ్ళీ వాయిదా పడక తప్పదేమోనని చెన్నై టాక్. తెలుగు వెర్షన్ సైతం సమాంతరంగా రావాల్సి ఉంది. ఆదికేశవ, కోటబొమ్మాళి పీఎస్ లతో పోటీకి రెడీ అనుకుంటున్న టైంలో ఈ వ్యవహారం షాక్ ఇచ్చేలా ఉంది. నెట్ ఫ్లిక్స్ తో నలభై కోట్లకు ఓటిటి ఒప్పందం చేసుకున్నాడనే వార్త గతంలోనే వచ్చింది. అయితే ఆ మొత్తం అందాలంటే థియేటర్ రిలీజ్ జరిగిపోవాలి. కానీ అప్పటిదాకా బయ్యర్లు ఊరికే ఉండరు. పోనీ స్వంత పూచికత్తు మీద ఏదైనా చేద్దామా అంటే ఏ మాత్రం తేడా వచ్చినా పరిస్థితి ఎంత దూరమైనా వెళ్లి పరిస్థితి దిగజారవచ్చు.
ఈ కారణంగానే గౌతమ్ మీనన్ చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారని, ఒకవేళ వాయిదా వేయాల్సి వచ్చినా కూడా చివరి నిమిషం దాకా ప్రయత్నించాలని కంకణం కట్టుకున్నారట. పొరపాటున పోస్ట్ పోన్ అయ్యిందంటే డిజిటల్ రూపంలో రావాల్సిన ఆదాయంలో కోత పడే ప్రమాదం ఉంది. ఇంకో మూడు రోజులే ఉన్నా కనీసం తమిళ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలుపెట్టలేదు. అలాంటప్పుడు తెలుగుది రావడం అనుమానంగానే ఉంది. పొన్నియిన్ సెల్వన్ కోసం అదే పనిగా హైదరాబాద్ వచ్చిన విక్రమ్ ఇప్పుడీ ధృవ నక్షత్రంకి వస్తాడా అని అడిగితే డౌటేనని చెప్పడం తప్ప ఏం చేయగలం.
This post was last modified on November 20, 2023 3:46 pm
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…