ఈ శుక్రవారం మంచి అంచనాల మధ్య తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మంగళవారం’ సినిమా మంచి టాకే తెచ్చుకుంది. దానికి ఓపెనింగ్స్ కూడా బాగున్నాయి. సినిమా మంచి విజయం సాధించే సంకేతాలు కనిపిస్తున్నాయి. శనివారం కూడా వసూళ్లు బాగున్నాయి. ఆదివారం ప్రపంచకప్ ఫైనల్ వల్ల వసూళ్లపై ప్రభావం ఉండొచ్చు. సినిమాకు మంచి టాక్ ఉంది కాబట్టి వీక్ డేస్‌లో కూడా సత్తా చాటుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ చిత్రంలో పెర్ఫామెన్స్ పరంగా ఎక్కువ మార్కులు హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కే పడతాయి. వేరే హీరోయిన్లెవ్వరూ అంత సులువుగా ఒప్పుకోని పాత్రలో ఆమె కన్విన్సింగ్ పెర్ఫామెన్స్‌తో ప్రశంసలు అందుకుంటోంది. సినిమాలో మరికొందరు నటులు మంచి పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఐతే సినిమా చివర్లో హైలైట్ అయింది మాత్రం జమీందారు భార్య పాత్రలో నటించిన అమ్మాయే.
చూడ్డానికి చాలా అందంగా, ముచ్చటగా కనిపిస్తూ.. చివర్లో షాకింగ్ ట్విస్టు ఇచ్చే ఈ పాత్రలో నటించిన అమ్మాయి ఎవరనే చర్చ నడుస్తోంది. తన పేరు.. దివ్యా పిళ్లై. ఆమె మలయాళ నటి. మలయాళంలో చాలా సినిమాలే చేసింది. ఓటీటీలో సూపర్ హిట్ అయిన టొవినో థామస్ చిత్రం ‘కలా’లో ఆమె హీరో భార్యగా ముఖ్య పాత్ర పోషించింది.
మలయాళంలో మరికొన్ని మంచి సినిమాలు చేసింది. తమిళంలోనూ ఒకట్రెండు సినిమాల్లో నటించింది. తెలుగులో దివ్యకు ఇదే తొలి చిత్రం కాదు. ఇప్పటికే నవీన్ చంద్ర హీరోగా దండుపాళ్యం దర్శకుడు రూపొందించిన ‘తగ్గేదేలే’లో హీరోయిన్ పాత్ర చేసింది. ఆ సినిమా ప్రేక్షకుల దృష్టిలో పడలేదు. ఆమె టాలెంట్ గుర్తించి అజయ్ భూపతి ‘మంగళవారం’లో ఛాన్సిచ్చాడు. ముందు మామూలుగా అనిపించే పాత్ర చివర్లో బాగా హైలైట్ అయింది. ఈ పాత్రలో దివ్య మంచి పెర్ఫామెన్స్ ఇచ్చి ప్రేక్షకుల దృష్టిలో పడింది.
This post was last modified on November 19, 2023 3:53 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…