టాలీవుడ్ టాప్ డిమాండ్ ఉన్న హీరోయిన్ల శ్రీలీల స్థానం ఏమిటో మళ్ళీ చెప్పనక్కర్లేదు. కనీసం నెలకో రిలీజ్ తో నాన్ స్టాప్ గా ఆడియన్స్ ని పలకరిస్తూనే ఉంది. ఇటీవలే భగవంత్ కేసరి సాధించిన ఘనవిజయం తనలో మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. బాలయ్యని చిచ్చా అని పిలుస్తూ రెగ్యులర్ పాటలు లేకుండా ఒక ఎమోషనల్ యాంగిల్ లో దర్శకుడు అనిల్ రావిపూడి పాత్రని తీర్చిదిద్దిన తీరుని విపరీతంగా ప్రేమించేసింది. అందుకే ట్రైలర్ లాంచ్ తో మొదలుపెట్టి సక్సెస్ మీట్లు, ఇంటర్వ్యూలు, థియేటర్ టూర్ల దాకా ఎక్కడికి రమ్మన్నా నో అనకుండా ప్రమోషన్లలో కీలకంగా వ్యవహరించింది.
శ్రీలీల కొత్త సినిమా ఆదికేశవ ఈ నెల 24 విడుదల కాబోతోంది. డేట్ అట్టే దూరం లేదు. ఆదివారం వరల్డ్ కప్ మ్యాచ్ మినహాయిస్తే కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉంది. టీమ్ మాత్రం అంతగా హడావిడి చేయడం లేదు. మొన్నహైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ కు మీడియాని, అభిమానులను పిలిచి చివరి నిమిషంలో ఈవెంట్ క్యాన్సిల్ చేశారు. ఇది తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. సాంకేతిక కారణాలని చెప్పారు కానీ అదేదో ముందే చూసుకుని ఉండాల్సింది. అయితే శ్రీలీల మాత్రం ఒకటి రెండు ఇంటర్వ్యూలలో తప్పించి ఎక్కడ ఆదికేశవ మీద స్పెషల్ ఇంటరెస్ట్ చూపించడం లేదు.
బహుశా రెగ్యులర్ హీరోయిన్ స్టైల్ లో ఉండటం కావొచ్చు, లేదా కంటెంట్ భగవంత్ కేసరి లాగా నటనకు స్కోప్ ఇచ్చినది కాకపోవడం అవ్వొచ్చు. ఏదైతేనేం శ్రీలీలని ఎక్కువగా ఆశిస్తున్న ఫ్యాన్స్ కు అమ్మడి దర్శనం తక్కువగానే ఉంది. టైటిల్, టీజర్ చూస్తే ఆదికేశవ ఏదో టెంపుల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందినట్టు అనిపిస్తోంది కానీ హీరో వైష్ణవ్ తేజ్, దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి మాత్రం దీంట్లో కమర్షియల్ అంశాలతో ఊహించని ఎన్నో ఎలిమెంట్స్ ఉంటాయని ఊరిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సైతం పెద్దగా రీచ్ తెచ్చుకోలేదు. అదే రోజు విడుదలవుతున్న కోటబొమ్మాళి పీఎస్ కు బజ్ పెరగడం గమనించాల్సిన విషయం.
This post was last modified on November 19, 2023 11:56 am
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…