Movie News

స్పార్క్ లైఫ్ ఎలా ఉందంటే

నిన్న విడుదలైన కొత్త సినిమాల్లో అందరి దృష్టిలో పడ్డది, చెప్పుకోదగ్గ టాక్ తో దూసుకుపోతున్నది మంగళవారం ఒక్కటే. అయితే స్పార్క్ లైఫ్ ని కూడా టీమ్ గట్టిగానే ప్రమోట్ చేసుకుంది. కొత్త హీరో విక్రాంత్ రెడ్డితో పాటు హీరోయిన్లు మెహ్రీన్, రుక్సర్ ధిల్లాన్ లు కలిసి థియేటర్లకు వెళ్లి మరీ టికెట్లు అమ్మారు. నిన్న మార్నింగ్ షోలు జనంతో కలిసి చూశారు. పబ్లిసిటీకి ఖర్చు పెట్టిన వైనం సోషల్ మీడియాలో కనిపించింది. విచిత్రంగా టైటిల్ కార్డులో దర్శకుడి పేరు తీసేసి ఏ ఫిలిం బై అంటూ బ్యానర్ పేరు వేసుకున్న స్పార్క్ లైఫ్ ఓపెనింగ్స్ సంగతి పక్కనపెడితే మ్యాటర్ ఉందో లేదో చూద్దాం.

ఆర్య(విక్రాంత్)ని తన కలల రాకుమారుడిగా భావించిన లేఖ(మెహ్రీన్)అతని వెంటపడి పిచ్చిగా ప్రేమించడం మొదలుపెడుతుంది. అయితే ఇతనికి మరో కోణం ఉందని జైదీప్(విక్రాంత్)పేరుతో కో మెడికల్ స్టూడెంట్ అనన్య(రుక్సర్)తో పాటు మరో కొంత మంది అమ్మాయిల హత్య కేసులో ఇతనే నిందితుడని పోలీసులు అరెస్ట్ చేశాక బయట పడుతుంది. స్పార్క్ లైఫ్ అనే మెదడుకు సంబంధించిన సైంటిఫిక్ ప్రాజెక్టుకు సంబంధించి ఈ వ్యవహారం ముడిపడి ఉంటుంది. ఇంతకీ ఆర్య, జైదీప్ ఇద్దరూ ఒక్కరేనా, ఇంత పెద్ద కుంభకోణంలో అసలు నేరస్థులు ఎవరు అనేది తెరమీదే చూడాలి.

నటనపరంగా విక్రాంత్ ఇంకా మెరుగుపడకుండా పెద్ద కాన్వాస్ తో ఎంట్రీ ఇవ్వడంతో ఖరీదైన పొరపాటే. ఎక్స్ ప్రెషన్లతో పాటు హీరో మెటీరియల్ కావడానికి తగినంత శిక్షణ బోలెడు తీసుకోవాలి. విలన్ గా గురు సోమసుందరం ఆకట్టుకుంటాడు. స్టోరీ లైన్ సంగతి పక్కనపెడితే కథా కథనాలు ఈ బడ్జెట్ కు తగ్గ స్థాయిలో లేకపోవడంతో సన్నివేశాలు తేలిపోయాయి. ఒక స్కామ్ చుట్టూ శాస్త్రీయ ప్రయోగాన్ని ముడిపెట్టి సూపర్ హీరో తరహాలో ఏదో చెప్పాలనుకున్న స్పార్క్ లైఫ్ టీమ్ ఇంకేదో చెప్పి ఫైనల్ గా నిరాశపరిచింది. ఓపిక తీరిక ఎంత ఉన్నా సరే స్పార్క్ లైఫ్ ఆడియన్స్ ని మెప్పించడం కష్టమే. 

This post was last modified on November 18, 2023 2:46 pm

Share

Recent Posts

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

1 hour ago

మల్టీస్టారర్ మూవీకి మర్చిపోలేని అవమానం

కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…

2 hours ago

ఆంధ్రా ముద్దుబిడ్డ అనంత్ అంబానీ

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…

2 hours ago

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

3 hours ago

వివేకా కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు

వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…

3 hours ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

4 hours ago