ఆహాకు గొప్ప మైలేజ్ ఇచ్చిన బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో చాలా ఆసక్తికరమైన విషయాలు బయట పడబోతున్నాయి. అందులో ప్రధానమైంది రష్మిక మందన్న ప్రేమకథ. ఇవాళ వదిలిన ప్రోమోలో దానికి సంబంధించిన కీలక క్లూస్ ఇవ్వడంతో స్ట్రీమింగ్ కాబోయే నవంబర్ 24 డేట్ కోసం మూవీ లవర్స్ ఎదురు చూడాల్సి వచ్చేలా ఉంది. అనిమల్ ప్రమోషన్ లో భాగంగా హీరో రన్బీర్ కపూర్, దర్శకుడు సందీప్ వంగాతో పాటు హీరోయిన్ రష్మిక కూడా హాజరయ్యింది. తనదైన శైలిలో బాలయ్య హుషారుగా ప్రశ్నలు అడుగుతూ, వాళ్ళ గురించి గొప్పగా చెబుతూ స్టేజి మీద స్టెప్పులు కూడా వేయించారు.
గేమ్ లో భాగంగా అర్జున్ రెడ్డి, అనిమల్ హీరోల్లో ఎవరు అందంగా ఉన్నారని రష్మికను అడగటం దగ్గర పజిల్ మొదలైంది. సమాధానం ట్రైలర్ లో రివీల్ చేయకపోయినా వచ్చే వారం తెలిసిపోతుంది. లైవ్ లో విజయ్ దేవరకొండకు రష్మికతో కాల్ చేయించడం మరో హైలైట్. ఫోన్ లిఫ్ట్ చేయగానే రౌడీ హీరో సంబోధించిన విధానం, రష్మిక ముసిముసినవ్వులు ఏదో గుట్టుని విప్పినట్టే అనిపిస్తోంది. గత కొంత కాలంగా ఈ జంట డేటింగ్ లో ఉందని పలు కథనాలు సాక్ష్యాలతో సహా వస్తున్నా ఇద్దరు స్పందించలేదు. మొన్న దీపావళి పండక్కు రష్మిక విజయ్ ఇంట్లోనే ఉన్నట్టు సెలబ్రేషన్స్ ఫోటోలో కనిపించింది.
ఇవన్నీ ఎంతవరకు నిజాలో ఎపిసోడ్ స్ట్రీమింగ్ జరిగే రోజు తెలుస్తుంది. అన్స్టాపబుల్ రెండు సీజన్లు దిగ్విజయంగా నడిపించిన బాలయ్య ఇప్పుడీ స్పెషల్ ఎడిషన్ ని త్వరగానే ముగించే అవకాశం ఉంది. బాబీ దర్శకత్వంలో సినిమా షూటింగ్ తో పాటు ఏపీలో రాబోయే ఎన్నికల కోసం బాలయ్య డైరీ బిజీగా మారనుంది. అందుకే ఈ సిరీస్ ని జెట్ స్పీడ్ తో లాగిస్తున్నారు. అయితే ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు రేంజ్ లో ఎవరైనా క్రేజీ సెలబ్రిటీ రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చిరంజీవితో ఉండొచ్చనే టాక్ వచ్చింది కానీ అది కార్యరూపం దాల్చే అవకాశాలు తక్కువేనని మెగా వర్గాల సమాచారం.
This post was last modified on November 18, 2023 2:46 pm
జనసేన కీలక నేత, ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ నిజంగానే విభిన్న పంథాతో సాగే నేత. ఇప్పటిదాకా…
ఏపీలో అధికార కూటమి మిత్ర పక్షాల మధ్య వక్ఫ్ బిల్లు వ్యవహారం.. తేలిపోయింది. నిన్న మొన్నటి వరకు దీనిపై నిర్ణయాన్ని…
హెడ్డింగ్ చూసి ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా. నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా భార్య వార్దా ఖాన్ వరస చూస్తే మీకూ…
టాలీవుడ్ కే కాదు మొత్తం భారతదేశ సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ ఇప్పటికే…
మచిలీపట్నం మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత కొనకళ్ల నారాయణరావు.. తన యాక్టివిటీని తగ్గించారు. ఆయన పార్టీలో ఒకప్పుడు యాక్టివ్…
టెక్ జనమంతా సింపుల్ గా శామ్ ఆల్ట్ మన్ అని పిలుచుకునే శామ్యూల్ హారిస్ ఆల్ట్ మన్… భారత్ లో…