ప్రస్తుతం టాలీవుడ్ టాప్ మోస్ట్ యాంకర్ గా స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న సుమ కనకాల గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. ఏళ్ళు గడుస్తున్న కొద్దీ హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు అవుతున్నారేమో కానీ సుమ మాత్రం ఎవర్ గ్రీన్ వ్యాఖ్యాతగా ప్రతి ప్రోగ్రాంకు ఫస్ట్ ఆప్షన్ గా నిలుస్తున్నారు. ఈవిడ డిమాండ్ ఏ స్థాయిలో ఉందంటే ఎక్కడ ఎప్పుడు జరుగుతుందో తెలియని గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నేనే యాంకరని చెప్పుకునేంత. నిజానికి అంత హుషారు చలాకీతనం ఇప్పటి వాళ్ళలో కొరవడిన మాట వాస్తవం. కొత్త వాళ్ళు వస్తున్నారు కానీ సుమ దరిదాపుల్లో కూడా నిలవలేకపోతున్నారు.
ఇంత అనుభవమున్న సుమ యాంకరింగ్ తో పాటు కొత్త సినిమాల ప్రమోషనల్ ఇంటర్వ్యూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవలే సప్త సాగరాలు దాటి సైడ్ బి కోసం హైదరాబాద్ వచ్చిన హీరో రక్షిత్ శెట్టితో ముఖాముఖీ నిర్వహించింది సుమ. సమయా భావం వల్ల ముందే ప్రిపేర్ కాకపోవడంతో కొన్ని ప్రశ్నలు మిస్ ఫైర్ కావడం వల్ల సోషల్ మీడియాకో టాపిక్ దొరికేసింది. స్టోరీ మీరు రాసుకున్నప్పుడే రెండు భాగాలు అనుకున్నారా అన్న క్వశ్చన్ వాటిలో ప్రధానమైంది. నిజానికి ఈ మూవీ కథ మాటలు స్క్రీన్ ప్లే అన్నీ హేమంత్ రావే తప్ప రైటింగ్ పరంగా రక్షిత్ ప్రమేయం లేదు.
టూ పార్ట్స్ అన్నప్పుడు ప్రొడ్యూసర్ ఎలా రియాక్ట్ అయ్యారనేది సుమ అడిగిన మరో ప్రశ్న. సప్త సాగరాలు రెండు భాగాలకు నిర్మాత కం హీరో రెండు ఒకరే. అతనే రక్షిత్ శెట్టి. ఇంకో ప్రశ్నలో కెరీర్ లో రైటర్, యాక్టర్, ప్రొడ్యూసర్, సింగర్ ఇలా ఇన్ని పాత్రలు ఎలా పోషించారని అడిగారు. నిజానికి రక్షిత్ గాయకుడు కాదు. ముందే టీమ్ నుంచి సరైన ఇన్ పుట్స్ తీసుకోకపోవడం వల్ల సుమకొచ్చిన తిప్పలివి. పోనీ స్క్రిప్ట్ వేరొకరు ప్రిపేర్ చేశారనుకుంటే వాళ్ళకైనా ఈ విషయాల పట్ల అవగాహన ఉండాల్సింది. ఏది ఏమైనా వీడియోల జమానాలో ఎవరైనా సరే జాగ్రత్తగా లేకపోతే ఇలాగే దొరికిపోతారు.
This post was last modified on November 17, 2023 11:40 pm
2008లో విడుదలైన చిత్రం ‘సిద్దూ ఫ్రమ్ సికాకుళం’ తో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది శ్రద్ధాదాస్. తొలి చిత్రంతోనే యూత్ లో…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను అమితంగా ఇష్టపడే యంగ్ హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకడు. అతను సినిమాల్లోకి రాకముందే…
చిన్న ఆర్టిస్టుగా మొదలుపెట్టి సోలో హీరోగా వరస అవకాశాలు చేజిక్కించుకునే దాకా సత్యదేవ్ పడిన కష్టం అంతా ఇంతా కాదు.…
కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్రలో ఘోర పరాభవం ఎదురైనా.. ఆపార్టీ వారసురాలు.. అగ్రనాయకురాలు, ఇందిరమ్మ మనవరాలు.. ప్రియాంక గాంధీ విషయంలో మాత్రం…
ఏపీ విపక్షం వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఇటీవల కాలంలో కొంత ప్రశాంతంగా ఉన్న వైసీపీ రాజకీయాలు .. ఇప్పుడు…
జైలుకు వెళ్లిన నాయకుల పట్ల ప్రజల్లో సానుభూతి ఉంటుందని చెప్పేందుకు.. మరో ఉదాహరణ జార్ఖండ్. తాజాగా ఇక్కడ జరిగిన ఎన్నికల్లో…