ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య రూపంలో భారీ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న దర్శకుడు బాబీ ఇప్పుడు బాలకృష్ణతో చేయబోతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ యాక్షన్ మూవీ ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకుంది. ప్రీ లుక్ లో గొడ్డలి, దాని మీద రేబాన్ గాగుల్స్ తో ఏ రేంజ్ లో మాస్ ఉండబోతోందో క్లూ ఇచ్చిన బాబీ క్యాస్టింగ్ విషయంలోనూ క్రేజీగా వెళ్తున్నాడని లేటెస్ట్ అప్డేట్. ఒక కీలక పాత్ర కోసం దుల్కర్ సల్మాన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలిసింది. రేపు అధికారికంగా ప్రకటించే అవకాశముంది.
మహానటి తర్వాత తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న దుల్కర్ కు కనులు కనులను దోచాయంటే మార్కెట్ ని పెంచింది. స్ట్రెయిట్ అయినా డబ్బింగ్ అయినా స్వంతంగా తన గొంతే వినిపించే ఈ విలక్షణ యంగ్ హీరో టాలీవుడ్ నుంచి ఏదైనా క్రేజీ ఆఫర్ వస్తే నో అనకుండా ఉండలేడు. వీరసింహారెడ్డి ఫేమ్ హానీ రోస్ తో పాటు కలర్ ఫోటో చాందిని చౌదరిఆల్రెడీ ఎంపికైన లిస్టులో ఉన్నారు. హీరోయిన్ ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఇందులో బాలయ్య చాలా రకాల గెటప్స్ లో కనిపిస్తారని ఇప్పటికే లీక్ వచ్చింది. షాకింగ్ లుక్స్ ఉంటాయని వినికిడి.
వచ్చే ఏడాది వేసవి ఏప్రిల్ లో విడుదల చేయాలనే లక్ష్యంతో వర్క్ చేస్తున్నారు. మార్చ్ లో ఏపీ ఎన్నికలు రావొచ్చు కనక బాలయ్య తెలుగుదేశం తరఫున పార్టీ ప్రచారంలో బిజీ అవుతారు. ఆలోగా ఆయనకు సంబంధించిన టాకీ పార్ట్, పాటలు పూర్తి చేసుకుంటే పోస్ట్ ప్రొడక్షన్ కి కావాల్సినంత సమయం దొరుకుతుంది. సంగీత దర్శకుడి విషయం ఇంకా తేలలేదు. తమన్, దేవిశ్రీ ప్రసాద్, అనిరుద్ రవిచందర్ ఇలా మూడు పేర్లు చక్కర్లు కొడుతున్నాయి కానీ ఫైనల్ గా ఎవరు లాక్ అవుతారన్నది వేచి చూడాలి. ఎన్బికె 109గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు.
This post was last modified on November 17, 2023 11:24 pm
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…