డిసెంబర్ లో బిగ్గెస్ట్ ఇండియన్ బాక్సాఫీస్ క్లాష్ గా ట్రేడ్ పండితులు వర్ణిస్తున్న సలార్ వర్సెస్ డంకీ పోటీలో ఎవరిది పైచేయి అవుతుందనే దాని మీద రకరకాల విశ్లేషణలు కొనసాగుతూనే ఉన్నాయి. పఠాన్, జవాన్ రెండు అతి పెద్ద బ్లాక్ బస్టర్లతో ఊపుమీదున్న షారుఖ్ ఖాన్ కు హ్యాట్రిక్ ఖాయమని అభిమానులు నమ్ముతుండగా సలార్ వేడిని తట్టుకోవడం ఊహించినంత సులభం కాదని డార్లింగ్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సలార్ తాలూకు పూర్తి స్థాయి ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ నవంబర్ 20 నుంచి మొదలుపెట్టబోతున్నారు. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది.
కానీ డంకీ విషయంలో ఇంత కదలిక కనిపించడం లేదు. యుఎస్ కి సంబంధించి కొన్ని లొకేషన్లలో ఆన్ లైన్ బుకింగ్స్ పెడితే గంటలు గడుస్తున్నా కేవలం సింగల్ డిజిట్ టికెట్లు అమ్ముడుపోయాయన్న వార్త కొత్త చర్చకు దారి తీసింది. అయితే ఆ తర్వాత కొంత సమయానికే సదరు సైట్ల నుంచి డంకీ టికెట్ అమ్మకాలు ఆపేశారు. ఇది సాంకేతిక సమస్యని, నిర్మాతలు ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వలేదు కాబట్టి దాని కోసం ఎదురు చూస్తున్నామని, అది రాగానే సెకండ్ల వ్యవధిలో బుకింగ్స్ ఉంటాయని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు. మొత్తానికి వ్యహహారమేదో తేడాగానే ఉంది.
ఇదంతా ఎలా ఉన్నా మాస్ మార్కెట్స్ లో మాత్రం సలార్ ఆధిపత్యం స్పష్టంగా ఉండబోతోంది. డిసెంబర్ 1 ట్రైలర్ వచ్చాక అంచనాలు అదుపులో పెట్టుకోవడం కష్టమని యూనిట్ సభ్యులు ఇప్పటికే తెగ ఊరిస్తున్నారు. షారుఖ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ కాంబోని మరీ తక్కువంచనా వేయడానికి లేదు కానీ దక్షిణాదితో పాటు మాస్ డామినేషన్ ఎక్కువగా ఉండే మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో షారుఖ్ నడక నల్లేరు మీద మాత్రం ఉండదు. పైగా కమర్షియల్ మసాలాలు పెద్దగా ఉండని ఎంటర్ టైనర్ డంకీ. వాయిదా ఆలోచనలు లేనట్టే కనిపిస్తోంది కానీ టీజర్, పోస్టర్లలో డేట్ లేకపోవడమే అనుమానాలను రేపుతోంది.
This post was last modified on November 17, 2023 1:34 pm
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా చివరి ఉత్తర్వుల్లో అద్భుత ట్విస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా కుటుంబ…
మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సాకే శైలజానాథ్.. తాజాగా వైసీపీ గూటికి చేరారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం…
సినీ రంగంలో నటులుగా తొలి అవకాశం రావడం ఒకెత్తయితే.. తొలి సక్సెస్ అందుకోవడం ఇంకో ఎత్తు. కొందరికి తొలి అవకాశంతోనే…
అక్కినేని నాగార్జున… టాలీవుడ్ లో సీనియర్ నటుడు. రాజకీయాలతో పని లేకుండా ఆయన తన పని ఎదో తాను ఆలా…
ఇవాళ విడుదలైన తండేల్ కు మంచి టాకే వినిపిస్తోంది. అదిరిపోయింది, రికార్డులు కొల్లగొడుతుందనే స్థాయిలో కాదు కానీ నిరాశ పరచలేదనే…
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. గత కొన్నేళ్లలో సోషల్ మీడియా వేదికగా హద్దులు దాటి ప్రవర్తించిన వైసీపీ కార్యకర్తలు,…