టాలీవుడ్లో పెద్ద సినిమాలకు కాపీ మరకలు అంటడం కొత్తేమీ కాదు. పేరున్న దర్శకులు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. తాజాగా ఓ వైపు కొరటాల శివ, మరోవైపు సుకుమార్ ఇవే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఐతే వీళ్లిద్దరి మీద ఆరోపణలు చేస్తున్న వారి వాదన అయితే అంత బలంగా లేదు. ఇంకా కనీసం టీజర్లు కూడా రాని సినిమాల కథలు తమవే అన్న వాదన గట్టిగా నిలబడట్లేదు.
అందులోనూ సుకుమార్ మీద కడప జిల్లా రచయిత వేంపల్లి గంగాధర్ చేసిన ఆరోపణలు మరీ తేలిపోతున్నాయి. ఐతే సోషల్ మీడియాలో మన స్టార్ డైరెక్టర్ల చౌర్యం గురించి ఇప్పుడు పెద్ద చర్చ అయితే నడుస్తోంది. ఈ సందర్భంగా ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరటాల శివ, సుకుమార్‌ల కంటే మరో అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను ఎక్కువ తిడుతుండటం గమనార్హం.
ఇప్పుడే కాదు.. టాలీవుడ్లో ఏ స్టార్ దర్శకుడి మీద కాపీ ఆరోపణలు వచ్చినా.. టాపిక్ డైవర్ట్ అయ్యేది త్రివిక్రమ్ వైపే. అందరిలోకి అత్యంత తెలివైన వాడిగా, జ్ఞాన సంపద ఉన్న వాడిగా, సాహిత్యంపై అమితమైన అవగాహన ఉన్నవాడిగా కనిపించే త్రివిక్రమ్ పెద్ద కాపీ మాస్టర్ అనేది ఆయన సినిమాల్ని పరిశీలిస్తే స్పష్టమవుతుంది. త్రివిక్రమ్.. కాపీ.. అనే పదాలు యూట్యూబ్‌లో కొడితే చాలు. ‘అతడు’ దగ్గర్నుంచి ‘అజ్ఞాతవాసి’ వరకు ఆయన ఎక్కడెక్కడి నుంచే లేపుకొచ్చిన సన్నివేశాలు వచ్చి కుప్పలు కుప్పలుగా పడిపోతాయి. ఇక ‘అఆ’ సినిమాను యద్దనపూడి సులోచనారాణి ‘మీనా’ నవల ఆధారంగా తీసి.. కనీసం ఆమెకు క్రెడిట్ కూడా ఇవ్వకుండా
త్రివిక్రమ్ ఎలా విమర్శలెదుర్కొన్నాడో తెలిసిందే. అలాగే వేంపల్లి గంగాధర్ ‘మొండికత్తి’ కథ స్ఫూర్తి ‘అరవింద సమేత’లో కనిపిస్తుంది. ఆ కోపంతోనే గంగాధర్ ఇప్పుడు సుకుమార్‌ను కూడా అదే గాటన కట్టేసి తన కథను కాపీ కొట్టేస్తున్నాడని అంటున్నాడు. ఫ్రెంచ్ మూవీ ‘లార్గో వించ్’ను పట్టుకొచ్చి ‘అజ్ఞాతవాసి’ని తీసిన విషయమూ స్పష్టంగా తెలిసిందే.
ఇలా త్రివిక్రమ్ మీద కాపీ మరకలకు కొదవే లేదు. ప్రస్తుత చర్చలో మిగతా దర్శకుల్ని పక్కన పెట్టి త్రివిక్రమ్‌ను తిట్టే వాళ్ల సంఖ్య భారీగానే ఉంటోంది. మిగతా వాళ్లతో పోలిస్తే మక్కీకి మక్కీ సీన్లు, స్టోరీలు దించేస్తాడన్నది త్రివిక్రమ్ మీద ఉన్న ఆరోపణ. అందుకే ఈ విమర్శలు. తన మీద జనాల్లో ఈ స్థాయి వ్యతిరేకత ఉందని త్రివిక్రమ్‌కు అసలు తెలుసా మరి.
This post was last modified on August 30, 2020 9:44 am
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…