Movie News

OTTలో డబ్బింగ్ సినిమాల హడావిడి

మొన్న దీపావళికి డబ్బింగులతో నెట్టుకొచ్చిన థియేటర్లకు పోటీగా ఇటు ఓటిటిలోనూ అదే ట్రెండ్ కనిపించడం విచిత్రమే. ప్రతి శుక్రవారం లాగే ఈసారి కూడా ఇల్లు కదలకుండా ఎంటర్ టైన్మెంట్ కోరుకునే ఆడియన్స్ కి చెప్పుకోదగ్గ ఆప్షన్లే ఉన్నాయి. అయితే అన్నీ అనువాదాలే కావడం గమనార్హం. వాటిలో మొదటిది సిద్దార్థ్ ‘చిన్నా’. ఎమోషనల్ డ్రామాగా చైల్డ్ సెంటిమెంట్ తో పాటు ఒక సున్నితమైన ఇష్యూతో వచ్చిన ఈ సినిమా థియేట్రికల్ గా సక్సెస్ కాలేదు. గొప్ప చిత్రంగా హీరో ఎంత ప్రమోట్ చేసుకున్నా లాభం లేకపోయింది. అయితే డిజిటల్ లో మంచి స్పందన వచ్చే అవకాశాలు లేకపోలేదు.

రెండోది శివరాజ్ కుమార్ ‘ఘోస్ట్’. జైలర్ తర్వాత ఇక్కడా గుర్తింపు తెచ్చుకున్న ఈ శాండల్ వుడ్ సీనియర్ హీరోకి మొదటి ప్యాన్ ఇండియా మూవీ ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు. కన్నడలో ఓ మోస్తరుగా ఆడితే తెలుగులో మాత్రం పోస్టర్ ఖర్చులు కూడా తేలేదు. మమ్ముట్టి మలయాళం లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కన్నూర్ స్క్వాడ్’ని హాట్ స్టార్ లోనే స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఒరిజినల్ భాషతో పాటు తెలుగు, తమిళ, కన్నడ ఆడియోలు అందుబాటులో ఉంటాయి. ఒక కేసు ఇన్వెస్టిగేషన్ కోసం బయలుదేరిన పోలీస్ బృందానికి ఎదురయ్యే సవాళ్ల నేపథ్యంలో ఇంటరెస్టింగ్ గా తీశారు.

వీటికన్నా రికమండ్ చేయాల్సిన సిరీస్ ఒకటుంది. మూడు దశాబ్దాల క్రితం జరిగిన భోపాల్ గ్యాస్ ట్రాజెడీ ఆధారంగా రూపొందిన ‘ది రైల్వే మెన్’ ఎల్లుండి నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. నాలుగు ఎపిసోడ్లతో రూపొందిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ లో మాధవన్, కేకే మీనన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ట్రైలర్ చూశాక ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇది ఒరిజినల్ గా హిందీలో తీసిన సిరీస్. మొత్తానికి తెలుగు నుంచి పెద్దగా చెప్పుకునే స్ట్రెయిట్ కంటెంట్ లేకుండా ఈ వారం గడపాల్సి ఉంటుంది. ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద చూడనివి కాబట్టి హ్యాపీగా కాలు కదపకుండా చూసేయొచ్చు. 

This post was last modified on November 16, 2023 4:15 pm

Share

Recent Posts

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

14 minutes ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

24 minutes ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

52 minutes ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

54 minutes ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

2 hours ago

రిజర్వేషన్ లెక్కలు… ఎవరెవరికి ఎన్ని? ఎక్కడ?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 106…

4 hours ago