బాలీవుడ్లో స్పోర్ట్స్ బయోపిక్స్ ఒక టైంలో ఎంత బాగా ఆడాయో తెలిసిందే. ‘ఎం.ఎస్.ధోని: అన్‌టోల్డ్ స్టోరీ’ అయితే పెద్ద సినిమాల స్థాయిలో వసూళ్లు రాబట్టింది. బాగ్ మిల్కా బాగ్, పాన్ సింగ్ తోమర్ లాంటి స్పోర్ట్స్ బయోపిక్స్ కూడా మంచి ఫలితాన్నందుకున్నాయి. ఈ వరుసలో తర్వాత చాలా స్పోర్ట్స్ బయోపిక్స్ వచ్చాయి కానీ.. అవేవీ సరైన ఫలితాలు అందుకోలేదు. సైనా, మిథాలీ రాజ్‌ల మీద తీసిన సినిమాలు వాషౌట్ అయ్యాక ఈ జానర్ జోరు తగ్గింది.
ఐతే సరైన స్పోర్ట్స్ బయోపిక్ తీస్తే ఇప్పటికీ మంచి రెస్పాన్సే వస్తుందన్న అభిప్రాయాలున్నాయి. ఆ పొటెన్షియాలిటీ ఉన్న బయోపిక్.. విరాట్ కోహ్లిదే అవుతుందన్న చర్చ కొంత కాలంగా నడుస్తోంది. ఐతే విరాట్ బయోపిక్ తీస్తే.. దానికి న్యాయం చేసే నటుడు ఎవరనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ మధ్య మీడియా వాళ్లు కూడా సెలబ్రెటీలను ఈ ప్రశ్న తరచుగా అడుగుతున్నారు.
తాజాగా రణబీర్ కపూర్ ఈ ప్రశ్నను ఎదుర్కొన్నాడు. ‘యానిమల్’ ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడుతుండగా.. విరాట్ కోహ్లి బయోపిక్ చేస్తారా? అందులో ఎవరు నటిస్తే బాగుంటుంది అని విలేకరులు అడగ్గా.. ‘‘కోహ్లి జీవితాన్ని సినిమాగా తీస్తే అందులో అతడే నటించాలి. ఎందుకంటే చాలామంది నటుల కంటే అతనే అందంగా కనిపిస్తాడు. అలాగే ఫిట్‌గా కూడా ఉంటాడు.
అందుకే తన పాత్రను కోహ్లీనే పోషించాలి’’ అంటూ తనదైన శైలిలో బదులిచ్చాడు రణబీర్. తద్వారా తానైతే కోహ్లి బయోపిక్‌లో నటించనని రణబీర్ చెప్పకనే చెప్పేశాడు. బాలీవుడ్ హీరోల సంగతేమో కానీ.. మన టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైర రామ్ చరణ్.. మరో యంగ్ హీరో రామ్‌ల్లో విరాట్ కోహ్లి పోలికలు ఉన్నాయని.. వాళ్లిద్దరిలో ఒకరు విరాట్ బయోపిక్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమవుతుంటాయి.
This post was last modified on November 16, 2023 3:32 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…