సూపర్ స్టార్ మహేష్ బాబుది గోల్డెన్ హార్ట్ అంటూ కొనియాడుతారు అభిమానులు. అందులో అతిశయోక్తి ఏమీ లేదు. దేశంలోనే అత్యధిక పారితోషకం అందుకునే నటుల్లో ఒకడైన మహేష్.. ఎన్నో ఏళ్ల నుంచి తన ఆదాయంలో కొంత భాగాన్ని ఛారిటీ కోసం ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఒక ఆసుపత్రి భాగస్వామ్యంతో అతను ఎంతోమంది అభాగ్యులైన చిన్నారుల ప్రాణాలు కాపాడాడు.
ఇప్పటిదాకా మహేష్ బాబు ఫౌండేషన్ పేరు మీద 2500 గుండె ఆపరేషన్లు జరిగాయంటే ఆశ్చర్యపోక తప్పదు. 2500 సర్జరీలు అంటే అది చిన్న విషయం కాదు. దాదాపు ప్రతి రోజూ మహేష్ ఫౌండేషన్‌కు కాల్స్ వస్తూనే ఉంటాయి. తరచుగా సర్జరీలు జరుగుతుంటాయి. తన కొడుకు పుట్టినపుడు చిన్న ఇబ్బంది తలెత్తితే.. అది చూసి పేద చిన్నారులకు సమస్య తలెత్తితే ఎలా అనే ఆలోచనతో ఈ గొప్ప పనికి శ్రీకారం చుట్టినట్లు మహేష్ బాబు చెప్పడం తెలిసిందే.
తన ఫౌండేషన్ మీద ఇలా గొప్ప సేవ చేస్తున్న మహేష్.. ఇప్పుడు తన తండ్రి పేరు మీద ఒక మంచి పనికి శ్రీకారం చుట్టాడు. సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన పేరు మీద విద్యా నిధి పథకాన్ని ప్రారంభించాడు. ప్రాథమికంగా 40 మంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ఎంచుకుని.. వారికి స్కూల్ స్థాయి నుంచి పీజీ వరకు ఆర్థిక సాయం అందించనున్నారు.
అన్ని దానాల్లోకి విద్యా దానం గొప్పది అంటారు. చదువుతో ఎలా జీవితాలు మారిపోతాయో చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. 40 మందిని పీజీ వరకు చదివించి వారికి భవిష్యత్తునిస్తే.. ఆ నలభై కుటంబాల భవిష్యత్తే మారిపోతుంది. తర్వాతి తరాలు కూడా ఆ ఫలాలను అనుభవిస్తాయి. తండ్రికి మహేష్ ఇస్తున్న గొప్ప నివాళి ఇదంటూ ఆయన మీద ప్రశంసలు కురుస్తున్నాయి.
This post was last modified on November 16, 2023 2:50 pm
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా చివరి ఉత్తర్వుల్లో అద్భుత ట్విస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా కుటుంబ…
మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సాకే శైలజానాథ్.. తాజాగా వైసీపీ గూటికి చేరారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం…
సినీ రంగంలో నటులుగా తొలి అవకాశం రావడం ఒకెత్తయితే.. తొలి సక్సెస్ అందుకోవడం ఇంకో ఎత్తు. కొందరికి తొలి అవకాశంతోనే…
అక్కినేని నాగార్జున… టాలీవుడ్ లో సీనియర్ నటుడు. రాజకీయాలతో పని లేకుండా ఆయన తన పని ఎదో తాను ఆలా…
ఇవాళ విడుదలైన తండేల్ కు మంచి టాకే వినిపిస్తోంది. అదిరిపోయింది, రికార్డులు కొల్లగొడుతుందనే స్థాయిలో కాదు కానీ నిరాశ పరచలేదనే…
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. గత కొన్నేళ్లలో సోషల్ మీడియా వేదికగా హద్దులు దాటి ప్రవర్తించిన వైసీపీ కార్యకర్తలు,…