Movie News

నాగార్జున సిద్దార్థతో అనిమల్ కనెక్షన్

రన్బీర్ కపూర్ హీరోగా రూపొందుతున్న అనిమల్ మీద అంచనాలు రిలీజ్ నాటికి పీక్స్ కు చేరుకునేలా ఉన్నాయి. అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన మూవీ కావడంతో బిజినెస్ వర్గాల్లోనూ విపరీతమైన క్రేజ్ నెలకొంది. టీజర్, పాటలు వేటికవే ఆకట్టుకునేలా ఉండటంతో డిసెంబర్ 1 భారీ ఓపెనింగ్స్ తో పాటు సంచలనాలు నమోదు కావడం ఖాయమే. సుదీర్ఘమైన నిడివి గురించి ఏవేవో టాక్స్ వినిపిస్తున్నాయి కానీ సెన్సార్ అయ్యేదాకా ఫైనల్ లెన్త్ ఎంతనేది క్లారిటీ రాలేదు. ఇక అనిమల్ కి ఎప్పుడో వచ్చిన నాగార్జున నేటి సిద్దార్థకి కనెక్షన్ ఏంటో చూద్దాం.

1990 క్రాంతి కుమార్ దర్శకత్వంలో నాగార్జున, శోభన జంటగా నేటి సిద్దార్థ వచ్చింది. ఈ కథలో తండ్రి పేరుమోసిన గ్యాంగ్ స్టర్ కెపి. ఈ పాత్రను రెబెల్ స్టార్ కృష్ణంరాజు పోషించారు. మాఫియా సామ్రాజ్యంలో జరిగిన కుట్రల వల్ల ప్రాణాలు కోల్పోతాడు. ఈ ఘటనకు ముందే విదేశాల నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన కొడుకు సిద్దార్థ(నాగార్జున)నాన్న చావుకు కారణమైన వాళ్ళ అంతు చూసేందుకు కంకణం కట్టుకుంటాడు. పెద్దగా ఆడలేదు కానీ మ్యూజిక్ కి మంచి పేరు వచ్చింది. వాస్తవానికిది 1975 ధర్మేంద్ర ధర్మాత్మని స్ఫూర్తిగా తీసుకుని  అండర్ వరల్డ్ బ్యాక్ డ్రాప్ లో తీశారు. వీటికి అసలు మూలం ది గాడ్ ఫాదర్.

ఇప్పుడు అనిమల్ సంగతికొస్తే తనను ఎంతగా కసురుకున్నా, ప్రేమగా చూడకపోయినా నాన్నంటే విపరీతమైన ప్రేమ ప్రదర్శించే యువకుడు రన్బీర్ కపూర్. మిలియనీర్ కం కార్పొరేట్ మాఫియా డాన్ (అనిల్ కపూర్) మరణానికి బాధ్యులైన వాళ్ళను వెతికి పట్టుకుని మరీ దారుణంగా శిక్షించే అనిమల్ గా మారిపోతాడు. లీకైన సోర్స్ ప్రకారం స్టోరీ లైన్ ఇదే. ట్రీట్మెంట్, స్క్రీన్ ప్లే వగైరా వ్యవహారాల్లో బోలెడు వ్యత్యాసం ఉంటుంది కానీ మెయిన్ పాయింట్ దగ్గరగా కలుస్తోంది. అయితే సందీప్ టేకింగ్ లో ఉన్న ఇంటెన్సిటి, విజువల్స్ ని ప్రెజెంట్ చేసే విధానం అనిమల్ ని మోస్ట్ వయొలెంట్ హీరో క్యారెక్టర్ గా ఉంటుందని ఇన్ సైడ్ టాక్. 

This post was last modified on November 14, 2023 4:50 pm

Share

Recent Posts

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

28 minutes ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

1 hour ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

2 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

2 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

4 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

4 hours ago