90వ దశకంలో కథానాయికగానే కాక పలు పాత్రల్లో రాణించి మెప్పించిన నటి కస్తూరి. కెరీర్ ముగిశాక కొన్నేళ్లు ఆమె కనిపించకుండా పోయింది. మధ్యలో బ్రెస్ట్ ఫీడింగ్ మీద అవగాహన కల్పించే ఉద్దేశంతో ఆమె చేసిన ఒక ప్రకటన సంచలనం రేపింది. బిడ్డకు పాలిస్తున్న ఆమె ఫొటోలు చర్చనీయాంశం అయ్యాయి. కొన్నేళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన కస్తూరి.. కొన్ని బోల్డ్ క్యారెక్టర్లు చేసింది.
అలాగే ఆమె మాట్లాడే తీరు కూడా బోల్డ్‌గా ఉంటోంది. తన ఇంటర్వ్యూలు కొన్ని సంచలనం రేపాయి. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో ‘భారతీయుడు’ సినిమాలో తనకు చెల్లి పాత్ర రావడం వెనుక కథను వివరించింది. నిజానికి కథానాయికగా పాత్రను ఆశిస్తూ దర్శకుడు శంకర్‌కు తాను బికినీ ఫొటోలను పంపితే.. అందుకు విరుద్ధంగా చెల్లి పాత్రను ఇచ్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
‘భారతీయుడు’ సినిమా కోసం ముందు నన్ను ఆడిషన్ చేశారు. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో సినిమా అంటే చాలా ఎగ్జైట్ అయ్యా. ఎలాగైనా ఈ అవకాశం దక్కించుకోవాలని అనుకున్నా. అందుకే ఆడిషన్ అయ్యాక శంకర్ సార్‌ను ఇంప్రెస్ చేయాలని నా బికినీ ఫొటోలను పంపా. ఎలాగైనా నేనే హీరోయిన్ అవ్వాలనుకున్నా. కానీ అప్పుడే ‘రంగీలా’ సినిమా రిలీజైంది. అందులో ఊర్మిళ బికినీ ఫొటోలు పాపులర్ అయ్యాయి. అందరి దృష్టి ఆమె వైపు మళ్లింది.
‘భారతీయుడు’ సినిమాకు కూడా ముందు ఆమెనే హీరోయిన్‌గా ఎంచుకున్నారు. నాకు మాత్రం హీరో చెల్లెలి పాత్ర ఇవ్వడంతో తీవ్రంగా నిరాశ చెందాను. కొన్ని రోజుల తర్వాత శంకర్ గారిని చెల్లి పాత్ర ఇచ్చారేంటి అని అడిగితే.. కథలో ఈ పాత్రే చాలా కీలకం అని సర్ది చెప్పారు’’ అని కస్తూరి వెల్లడించింది. ‘భారతీయుడు’కు ముందు ఊర్మిళనే కథానాయికగా తీసుకున్నప్పటికీ తర్వాత ఆ స్థానంలోకి మనీషా కొయిరాలా వచ్చింది. ‘భారతీయుడు’ తర్వాత కస్తూరికి ఎక్కువగా చెల్లి పాత్రలే వచ్చాయి. కథానాయికగా ఆమె ఎదగలేకపోయింది.
This post was last modified on November 14, 2023 4:13 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…