‘అర్జున్ రెడ్డి’ హిందీ వెర్షన్ ‘కబీర్ సింగ్’ తీస్తున్న టైంలో ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ.. తన సినిమాల్లో వయొలెన్స్ గురించి మాట్లాడుతూ.,. అసలు వయొలెన్స్ అంటే ఎలా ఉంటుందో తర్వాత చూపిస్తా అని వ్యాఖ్యానించాడు. తన కొత్త చిత్రానికి ‘యానిమల్’ అనే టైటిల్ పెట్టడంతోనే ఇదొక వయొలెంట్ మూవీ అనే సంకేతాలు ఇచ్చాడు.
ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్లో రణబీర్ కపూర్ ఎంత వయొలెంట్‌గా కనిపించాడో.. గొడ్డలి పట్టుకుని ఎలా శత్రువులపై విరుచుకుపడ్డాడో చూశాం. తర్వాత మరో టీజర్లోనూ వయొలెన్స్ కనిపించింది. త్వరలోనే ట్రైలర్ కూడా రాబోతోంది. అందులో మరింత వయొలెన్స్ ఉంటుందని చెబుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘పాపా మేరే జాన్’ (తెలుగులో నాన్నా నువ్వంటే నా ప్రాణం’) అనే పాటను లాంచ్ చేశారు.
అందులో కొన్ని సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. రణబీర్ కపూర్ ఫ్లైట్లో మందుకొట్టి.. తర్వాత వెళ్లి పైలట్ స్థానంలో కూర్చుని డ్రైవ్ చేసే సన్నివేశం ఒకటి చూపించారిందులో. ఇంతకుముందు రష్మికతో కలిసి కనిపించే డ్యూయెట్లో రణబీర్ క్లీన్ షేవ్‌తో ఫ్లైట్ డ్రైవ్ చేసే సీన్ పెట్టాడు సందీప్. అందులో లుక్‌కు, కొత్త పాటలోని రణబీర్ లుక్‌కు అసలు పోలిక లేదు.
కంటికి దెబ్బ తగిలి రక్తం కారుతూ.. మరోవైపు ఛాతీ మీద కత్తి గాటుకు చికిత్స తీసుకున్నట్లుగా అతను కనిపిస్తున్నాడు. ఈ పాటలో రణబీర్ లుక్, అతడి స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ కూడా ప్రేక్షకులకు ఒక రకమైన భయాన్ని కలిగించేలాగే ఉన్నాయి. ముందు అన్నట్లే సందీప్ రెడ్డి.. ఈ సినిమాతో వయొలెన్స్‌ను పీక్స్‌లో చూపిస్తాడనే సంకేతాలను ప్రోమోలు ఇస్తున్నాయి. డిసెంబరు 1న ‘యానిమల్’ విడుదల కానుండగా.. మరి కొన్ని రోజుల్లోనే దుబాయ్ బుర్జ్ ఖలీఫా వేదికగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కాబోతోంది. మరి అందులో ఎంత వయొలెన్స్ ఉంటుందో చూడాలి.
This post was last modified on November 14, 2023 2:34 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…