వచ్చే నెల డిసెంబర్ 7 విడుదల కాబోతున్న హాయ్ నాన్న ప్రమోషన్లు విస్తృతంగా జరుగుతున్నాయి. సలార్ కోసం ముందు అనుకున్న డేట్ కన్నా త్వరగా వచ్చేయడం నానికి ఒకరకంగా ప్లస్ అవుతున్నప్పటికీ మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ కావడంతో అంచనాలు పెంచే భారం పెద్దదే ఉంది. అయితే నాన్నకో సమస్య బిజినెస్ పరంగా ఇబ్బంది పెడుతోంది. పోస్టర్లు, టీజర్, పాటలు చూశాక ఆడియన్స్ లో ఇదో ఎమోషనల్ డ్రామా అనే విషయం అర్థమైపోయింది. చైల్డ్ సెంటిమెంట్ తో పాటు హీరో హీరోయిన్ మధ్య అందమైన కెమిస్ట్రీ ఉందనే క్లారిటీ ఇచ్చేయడంతో ఫ్యామిలీ జనాల్లో మంచి క్రేజ్ వచ్చింది.
చిక్కంతా మాస్ వర్గాల నుంచి వస్తోంది. నిర్మాతలేమో సీడెడ్ లాంటి ప్రాంతాలకు కొంచెం పెద్ద రేట్లే అడుగుతున్నారట. అయితే దసరా లాగా హాయ్ నాన్న కమర్షియల్ బొమ్మ కాదు. ఫీల్ గుడ్ కంటెంట్ తో వస్తోంది. కనెక్ట్ అయితే కుటుంబ ప్రేక్షకులు థియేటర్లు క్యూ కడతారు. కానీ బిసి సెంటర్లలో జనాన్ని ఫుల్ చేయడం అంత సులభం కాదు. గతంలో జెర్సికి ఇలా జరగడం వల్లే లాభాల శాతం పరిమితంగా ఉండిపోయింది. హాయ్ నాన్నలోనూ ఇలాంటి అంశాలే డామినేట్ చేయబోతున్నాయి. కాకపోతే అంత ట్రాజెడీ క్లైమాక్స్ లేకపోవడం ప్లస్ అయ్యే ఛాన్సే ఎక్కువ.
అంటే సుందరానికి టైంలోనూ లెన్త్, టాక్ రెండూ రిజల్ట్ పరంగా కీలక పాత్ర పోషించాయి. హాయ్ నాన్నకు అలా జరగకుండా కొత్త దర్శకుడు శౌర్యువ్ తో కలిసి నాని ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడట. హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం సినిమా రిలీజయ్యాక భారీ రీచ్ తెచ్చుకుంటుందని, ఆ నమ్మకాన్నే ఇంటర్వ్యూలలో వ్యక్తం చేస్తూ వస్తున్నాడు. మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటిస్తున్న హాయ్ నాన్నకు పోటీ పరంగా నితిన్ ఎక్స్ ట్రాడినరీ మ్యాన్, ఆపరేషన్ వాలెంటైన్ లు కాంపిటీషన్ ఇవ్వనున్నాయి. గ్యాంగ్స్ అఫ్ గోదావరితో పాటు వీటిలో ఒకటి డేట్ మార్చే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ టాక్. చూద్దాం.
This post was last modified on November 13, 2023 6:08 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…