వైఎస్ కుటుంబంపై ప్రముఖ సినీ కమెడియన్, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ ప్రశంసలు కురిపించారు. వైఎస్ ఫ్యామిలీకి మాట తప్పే అలవాటు లేదని అలీ అన్నారు. వైఎస్సార్ నటుడిలో ఓ కళాకారుడ్ని మాత్రమే చూసి సాయం చేశారని, ఇప్పుడు తండ్రి బాటలోనే సీఎం జగన్ కూడా నడుస్తున్నారని అలీ పొగడ్తలతో ముంచెత్తారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు పోసాని కృష్ణమురళి, అలీలపై టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ చేశారు. జగన్ ను వేనోళ్ల అలీ, పోసాని పొగుడుతున్నారని, చిత్ర పరిశ్రమకు జగన్ ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. ఏం చేశాడని జగన్ ను కీర్తిస్తున్నారని ప్రశ్నించారు.
ఏపీలో పుట్టిన బిడ్డగా గర్విస్తున్నానని అలీ అన్నారని, ఏపీలో పుట్టిన బిడ్డగా తాను కూడా గర్విస్తానని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పనులన్నీ గర్వించదగ్గవేననీ, కానీ, జగన్ మోహన్ రెడ్డి ఏం చేశాడని అలీ ఆయను పొగుడుతున్నాడో చెప్పాలని నిలదీశారు. తన ప్రశ్నలకు అలీ, పోసాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ సమాధానం చెప్పలేకపోతే… అవును, మాకు సమాధానం చెప్పడం చేతకాలేదని చెప్పాలని అన్నారు.
టికెట్ రేట్ల కోసం అలీ, పోసాని, చిరంజీవి గారు, ఆర్.నారాయణమూర్తి గారు, రాజమౌళి గారు జగన్ వద్దకు వెళ్లారని, జగన్ కు చిరంజీవి రెండు చేతులు జోడించి దండం పెడుతున్న దృశ్యాల వీడియోను ఎందుకు విడుదల చేశారని ప్రశ్నించారు. ఆ వీడియో విడుదల చేయడాన్ని అలీ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. ఆ వీడియోతో ఇండస్ట్రీలో చిరంజీవి హుందాతనం ఎంతో పెరిగిపోయిందని, ఖండించకపోవడం వల్ల మీ విలువ తగ్గిపోయిందని అలీని దుయ్యబట్టారు.
మీరు సినిమా ఇండస్ట్రీకి ఏం చేశారు? జగన్ మోహన్ రెడ్డి నుంచి ఏం తాయిలాలు తీసుకువచ్చారు? అని ప్రశ్నించారు. “మీ వల్ల ఇండస్ట్రీకి ఏమైనా రాయితీలు వచ్చాయా? మనం విశాఖలో ఏమైనా స్టూడియో కట్టగలిగామా? ఏపీలో షూటింగులు జరుపుకోవడానికి, ఇక్కడ్నించి ఏపీకి తరలి వెళ్లడానికి ఏమైనా అనుకూల వాతావరణం కల్పించగలిగారా?” అని నట్టి కుమార్ ప్రశ్నించారు.
This post was last modified on November 12, 2023 10:04 am
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…