నిన్న విడుదలైన జిగర్ తండ డబుల్ ఎక్స్ కి తెలుగులో ఆశించిన స్పందన లేదని కలెక్షన్లు, రివ్యూలు రెండూ స్పష్టం చేశాయి. చాలా చోట్ల కనీస ఓపెనింగ్స్ రాలేదు. అర్బన్ లో ఓ మోస్తరుగా ఓకే అనుకుంటే బిసి సెంటర్స్ లో మాత్రం నామమాత్రపు వసూళ్లు నమోదయ్యాయని ట్రేడ్ టాక్. తమిళంలో ఎలా రిసీవ్ చేసుకుంటున్నారనేది మనకనవసరం. అభిరుచుల్లో తేడాలుంటాయి కాబట్టి ఇక్కడి ఫలితాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. దీనికి చరణ్ అభిమానులకు ఉన్న కనెక్షన్ ఏంటంటే విషయానికి వద్దాం. గేమ్ ఛేంజర్ కు కథను ఇచ్చింది జిగర్ తాండ డబుల్ ఎక్స్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజే.
ఇక్కడ ఎందుకు టెన్షనంటే గేమ్ చేంజర్ లో చరణ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ దశాబ్దాల క్రితం బ్యాక్ డ్రాప్ తో జరుగుతుంది. అప్పటి రాజకీయాలు, పార్టీ ఫిరాయింపులు, నమ్మక ద్రోహాలు వీటి చుట్టూ అల్లుకున్నారు. అప్పన్నగా రామ్ చరణ్ సన్నని మీసం, పంచెకట్టుతో కనిపిస్తాడు. జిగర్ తండలోనూ పాలిటిక్స్ టచ్ చేసిన కార్తీక్ సుబ్బరాజ్ అందులో డ్రామాని మరీ ఓవర్ గా ప్రెజెంట్ చేశారు. అడవి గిరిజనులను మోసం చేసే క్రమాన్ని ముఖ్యమంత్రి రేంజ్ లో చూపించడం అతిశయోక్తిని దాటి పోయింది. క్లైమాక్స్ అయితే మనవాళ్ళు అంత సులభంగా జీర్ణించుకోలేని రీతిలో ఉంటుంది.
ఇలాంటివి గేమ్ చేంజర్ లోనూ ఉంటాయేమోననే అనుమానం రావడం సహజమే. కాకపోతే స్టోరీ ఇచ్చింది సుబ్బరాజే అయినా దానికి స్క్రీన్ ప్లే రాసుకున్నది శంకరే కాబట్టి అవసరమైన చోట మార్పులు చేర్పులు ఉండొచ్చు. పిజ్జాతో మొదలుపెట్టి కార్తీక్ సుబ్బరాజ్ శైలి టాలీవుడ్ కు సింక్ అయిన సందర్భాలు తక్కువ. గద్దలకొండ గణేష్ కి హరీష్ శంకర్ బోలెడు మార్పులు చేసుకున్నాడు కాబట్టి ఆ మాత్రం విజయం సాధించింది. మక్కికి మక్కి తీసుంటే ఇంకోలా ఉండేది. సో గేమ్ చేంజర్ వచ్చేదాకా స్టోరీ మీద ఈ సస్పెన్స్ కొనసాగక తప్పదు. విడుదల చాలా దూరం ఉంది కాబట్టి ఇప్పట్లో తేలే వ్యవహారం కాదు.
This post was last modified on November 11, 2023 2:46 pm
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండే వారి నుంచి వచ్చే మాటల వెనుక ఊహకు అందని లెక్కలు.. సమీకరణాలు ఉంటాయి. అందునా..…