సెప్టెంబరు 2.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పండుగ రోజు. అది పవన్ పుట్టిన రోజు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత రెండేళ్లు ఆ రోజు సాధారణంగా గడిచిపోయింది పవన్ అభిమానులకు. ఎందుకంటే ఆ రెండేళ్లు పవన్ సినిమాలకు దూరంగా ఉన్నాడు. రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. కానీ ఈ పుట్టిన రోజు సంగతి వేరు. ఒకటికి రెండు సినిమాల్లో నటిస్తున్నాడు.
కాబట్టి వాటి నుంచి ఆ రోజు ఏవైనా విశేషాలు వస్తాయని అభిమానులు ఆశించడంలో తప్పు లేదు. క్రిష్ సినిమా సంగతేమో కానీ.. పది నెలల కిందట మొదలై, మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న ‘వకీల్ సాబ్’ నుంచి టీజర్ లాంటిది కచ్చితంగా ఉంటుందని అభిమానులు ఆశతో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, ఓ పాట రిలీజైంది. ఇప్పుడిక రిలీజ్ చేయగలిగింది టీజర్ మాత్రమే.
ఐతే ఆ విషయాన్ని ఖరారు చేయకుండా.. సెప్టెంబరు 2న పవన్ అభిమానులకు ఏదో ఒక కానుక అయితే తప్పక ఉంటుందని సంకేతాలు ఇచ్చాడు ఈ చిత్ర సంగీత దర్శకుడు తమన్. WEDNESDAY అని టైప్ చేసి వెనుక ఒక హార్ట్ ‘లవ్’ సింబల్ పెట్టాడు తమన్. సెప్టెంబరు 2న బుధవారమే కావడంతో ఆ రోజు రిలీజ్ చేయబోయే ‘వకీల్ సాబ్’ విశేషం గురించే తమన్ సంకేతాలు ఇస్తున్నాడని అర్థమైపోయింది. మరి ఆ కానుక ఏంటో చూడాలి.
ఇప్పటికే 80 శాతం దాకా చిత్రీకరణ పూర్తి కావడం, పోస్ట్ ప్రొడక్షన్ పని కూడా చాలా వరకు చేసేయడం, కొన్ని నెలలుగా టీం అంతా ఖాళీగా ఉండటంతో టీజర్‌కు కంటెంట్ కోసం వెతుక్కోవాల్సిన పనైతే లేదు. ఒకట్రెండు రోజుల్లో టీజర్ గురించి అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశముంది. అలాగే క్రిష్ సినిమా నుంచి పవన్ ఫస్ట్ లుక్ ఏమైనా రిలీజవుతుందా అన్న ఆశతో కూడా ఉన్నారు ఫ్యాన్స్. దాని సంగతేంటో చూడాలి.
This post was last modified on August 28, 2020 8:05 pm
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…