నవీన్ చంద్ర.. తెలుగులో పదేళ్లుగా నటిస్తున్నాడు. తొలి చిత్రం ‘అందాల రాక్షసి’లోనే తన టాలెంట్ ఏంటో అందరికీ తెలిసింది. నటుడిగా మంచి స్థాయి అందుకుంటాడన్న అంచనాలు కలిగాయి అతడి విషయంలో. ఐతే ఈ పదేళ్లలో మంచి పాత్రలు చాలానే చేశాడు కానీ.. నటుడిగా, హీరోగా అనుకున్నంత పెద్ద స్థాయికి మాత్రం ఎదగలేకపోయాడు. సినిమా ఛాన్సులకు లోటేమీ లేదు కానీ.. కెరీర్ ఒక స్థాయికి మించి ఎదగలేకపోతోంది.
‘అరవింద సమేత’లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అతడి కెరీర్‌ను మలుపు తిప్పుతుందనుకుంటే అలాంటిదేమీ జరగలేదు. ఏదో సినిమాలు వస్తున్నాయి, చేసుకుపోతున్నాడు కానీ.. తన టాలెంట్‌కు తగ్గ అవకాశాలు ఎప్పుడు వస్తాయా అని చూస్తున్నాడు. ఇప్పుడు ఓ తమిళ సినిమా నవీన్ చంద్రకు మంచి బ్రేక్ ఇచ్చేలా కనిపిస్తోంది. ఆ చిత్రమే.. జిగర్‌తండ డబుల్ ఎక్స్.
రాఘవ లారెన్స్, ఎస్.జె.సూర్య ముఖ్య పాత్రలు పోషించిన ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’లో నవీన్ చంద్రనే మెయిన్ విలన్ అని చెప్పొచ్చు. వేరే విలన్ పాత్రలు ఉన్నప్పటికీ.. హైలైట్ అయింది నవీనే. క్రూరుడైన డీఎస్పీ పాత్రలో తన స్క్రీన్ ప్రెజెన్స్, నటన అదిరిపోయాయి. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో ఆ పాత్ర.. తన పెర్ఫామెన్స్ బాగా హైలైట్ అయ్యాయి. తన పెర్ఫామెన్స్‌తో ఆ పాత్రకు ఒక వెయిట్ తీసుకొచ్చాడు నవీన్.
విశేషం ఏంటంటే.. తమిళంలో తన పాత్రకు నవీనే స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నాడు. పర భాషా నటుడు అన్న ఫీలింగే కలిగించకుండా చక్కగా డైలాగులు పలికాడు. విలనిజాన్ని పండించడంలో నవీన్ తనదైన ముద్ర వేశాడు. ఈ సినిమాకు తెలుగులో యావరేజ్ టాకే వస్తోంది కానీ.. తమిళంలో మాత్రం టాక్ చాలా బాగుంది. నవీన్ నటనకూ ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమాతో అతను తమిళంలో బిజీ అయిపోయేలా ఉన్నాడు.
This post was last modified on November 10, 2023 7:56 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…