ఇండియా ఓటిటి రంగంలో అందులోనూ వెబ్ సిరీస్ కు సంబంధించి ట్రెండ్ సెట్టింగ్ రెస్పాన్స్ తెచ్చుకున్నవి కొన్నే. వాటిలో ఫ్యామిలీ మ్యాన్, స్కామ్ 1992, బ్రీత్ లాంటివి ప్రముఖంగా చెప్పుకోవచ్చు. కానీ మీర్జాపూర్ కు మాత్రం పెద్ద కల్ట్ ఫాలోయింగ్ ఉంది. అప్పటిదాకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మీడియం వేషాలతో నెట్టుకుంటూ వస్తున్న పంజాజ్ త్రిపాఠిని ఒక్కసారిగా స్టార్ ని చేసేసి భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసే స్థాయికి చేర్చింది. రెండు భాగాలు సక్సెసయ్యాక ఇప్పుడీ బ్లాక్ బస్టర్ కి మూడో సీజన్ రెడీ అవుతోంది. అదే క్యాస్టింగ్, టీమ్ తో ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు.
దీని కోసం వెయిటింగ్ ఏ స్థాయిలో ఉందంటే ప్రైమ్ క్లూ ఇవ్వడం భారీ ఎత్తున అభిమానులు స్పందిస్తున్నారు. మిర్జాపూర్ అనే పట్టణంలో అఖండానంద్ కుటుంబం చేసే దుర్మార్గాల వల్ల జనంతో పాటు పోలీస్ వ్యవస్థ కూడా నిమ్మకు నీరెత్తన్నట్టు ఉంటుంది. ముఖ్యంగా అతని కొడుకుల ప్రవర్తన, వాళ్ళ వల్ల కథ మలుపులు తిరిగే విధానం ఓ రేంజ్ లో పేలాయి. విచ్చలవిడి వయోలిన్స్, బూతులు, అక్రమ సంబంధాల వ్యవహారాలు, డబుల్ మీనింగ్ డైలాగులు పుష్కలంగా ఉన్న మీర్జాపూర్ తెలుగు డబ్బింగ్ లోనూ ఓ రేంజ్ సంచలనం రేపింది. అందుకే సీక్వెల్ అంటే అంత క్రేజ్.
ప్రస్తుతం ట్రెండ్ ని బట్టి చూస్తే ఓటిటి వెబ్ సిరీస్ లకు జనంలో ఆసక్తి చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు కరోనా టైంలో గంటల తరబడి ఏకధాటిగా చూసే స్టేజి నుంచి ఇప్పుడు రివ్యూలు చదివి బాగుందంటేనే చూడాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇవి సక్సెస్ అయిన టైంలో ఓటిటిలకు వాచింగ్ అవర్స్(వీక్షించే గంటలు) భారీగా ఉండి దానికి తగ్గట్టే ఆదాయం విపరీతంగా వచ్చి పడేది. కానీ ఇప్పుడు గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. మళ్ళీ మీర్జాపూర్ లాంటివి బూస్ట్ ఇస్తే తప్ప పికప్ అయ్యేలా కనిపించడం లేదు. అన్నట్టు థర్డ్ సీజన్ లో అంతకు మించి అన్న రేంజ్ లో హింస, విశృంఖలత్వం ఉంటుందట.
This post was last modified on November 10, 2023 1:58 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…