ప్రభాస్ అభిమానుల అనుమానాలకు, బయట జరుగుతున్న ప్రచారాలకు చెక్ పెడుతూ ఎట్టకేలకు హోంబాలే ఫిలింస్ అప్డేట్స్ మొదలుపెట్టింది. త్వరలోనే ట్రైలర్ తేదీ ప్రకటిస్తామని ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా డార్లింగ్ ఫ్యాన్స్ లో ఉత్సాహం వచ్చింది. వీళ్ళు డేట్ చెప్పకపోయినా విశ్వసనీయ సమాచారం మేరకు డిసెంబర్ 1 భారీ ఎత్తున ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగబోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ముఖ్యమైన నగరాల్లోని థియేటర్లలో స్క్రీనింగ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే రోజు రిలీజ్ కాబోతున్న అనిమల్ తో పాటు సలార్ విధ్వంసాన్ని అటాచ్ చేసే అవకాశం ఉంది.
సో ఇంకో ఇరవై రెండు రోజులు ఎదురు చూస్తే సలార్ లో ప్రభాస్ యాక్షన్ సాగా ఏ రేంజ్ లో ఉండబోతోందో శాంపిల్ చూడవచ్చు. సినిమా పోస్ట్ పోన్ కావొచ్చనే ప్రచారానికి చెక్ పెడుతూ డిసెంబర్ 22 తేదీని మరోసారి స్పష్టంగా పేర్కొనడంతో ఇంకెలాంటి అనుమానాలు అక్కర్లేదు. షారుఖ్ ఖాన్ డంకీ తీవ్రమైన పోటీ ఇస్తున్నప్పటికీ దానికి ధీటుగా ప్రమోషన్లు జరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రభాస్ ఎలాగూ తిరిగి వచ్చేశాడు కాబట్టి ఇంకెలాంటి అడ్డంకులు లేవు. చివరి స్టేజి లో ఉన్న నిర్మాణ కార్యక్రమాలతో పాటు పబ్లిసిటీ కంటెంట్ ని డిజైన్ చేయించే పనిలో ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నాడు.
ఎట్టి పరిస్థితుల్లోనూ సలార్ వెనుకడుగు ఉండదని క్లారిటీ వచ్చేసింది కాబట్టి మూవీ లవర్స్ నిశ్చింతగా ఉండొచ్చు. ప్రస్తుతం ఐటెం సాంగ్ షూట్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏకధాటిగా జరుగుతున్నాయి. చేతిలో ఎక్కువ టైం లేదు. పరుగులు పెట్టాలి. కెజిఎఫ్ తరహాలో సలార్ లో ఉన్నది తక్కువే పాటలే అయినా త్వరగా వదిలితే జనంలోకి వెళ్లి క్రమంగా బజ్ ని పెంచుతాయి. జనవరిలో వచ్చే గుంటూరు కారం లిరికల్ సాంగే రిలీజయ్యింది. అలాంటిది సలార్ ఇంతకన్నా ఆలస్యం చేయకూడదు. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ట్రైలర్ లోనే సెకండ్ పార్ట్ తాలూకు క్లూస్ ఇచ్చే అవకాశముందని బెంగళూరు టాక్.
This post was last modified on November 9, 2023 7:17 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…