స్టార్ కిడ్స్ వ్యవహారాల్లో అభిమానులకే కాదు సగటు సామాన్య జనాలకు విపరీతమైన ఆసక్తి ఉంటుంది. వాళ్ళు ఇంకా సినిమాల్లోకి రాకపోయినా సరే రకరకాల కథలు ప్రచారంలోకి వచ్చేస్తాయి. షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ఈ మధ్య పబ్లిక్ లైఫ్ లోకి బాగా వస్తోంది. ఆమె నటించిన డెబ్యూ ది ఆర్చీస్ త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. జోయా అక్తర్ దర్శకత్వంలో ఇది రూపొందింది. ఇందులో ఆమెతో పాటు అగస్త్య నందా నటించాడు. ఇతను అమితాబ్ బచ్చన్ కూతురు శ్వేతా బచ్చన్ గారాల వారసుడు. తాతకు తగ్గ మనవడిగా ఇండస్ట్రీ ఎంట్రీ కోసం పరుగులు పెడుతున్నాడు.
ఈ మధ్య వీళ్లిద్దరూ బాగా చనువుగా ఉంటున్నారని బాలీవుడ్ టాక్. ఇటీవలే ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా దివాలి పార్టీ ఇచ్చాడు. దానికి సెలబ్రిటీలు భారీ ఎత్తున హాజరయ్యారు. సుహానాతో పాటు అగస్త్య కూడా వచ్చాడు. ఆ అమ్మాయి రాకతో మొదలుపెట్టి తిరిగి కారులో వెళ్లిపోయే ముందు డోరు వేసుకునే దాకా అంటిపెట్టుకునే ఉండటం మీడియా దృష్టిలో పడకుండా పోలేదు. లోపల పార్టీలో సైతం చాలా చనువుగా ఉన్నారని, అగస్త్య తల్లి శ్వేతాకు వీళ్ళ స్నేహంలోని ఘాడత ముందే తెలుసని ఇన్ సైడ్ టాక్. అయితే వీటిని బట్టే బంధాన్ని నిర్ధారించలేం కానీ ఊరికే ఇలాంటి వార్తలు పుట్టుకురావుగా.
ఇదంతా షారుఖ్ ఖాన్ కు తెలుసో లేదో కానీ మొత్తానికి టాపిక్ మాత్రం హాట్ గా మారింది. సుహానా ఖాన్ ని తెరమీద హీరోయిన్ గా పరిచయం చేసేందుకు అగ్ర నిర్మాతలు విపరీతమైన మంతనాలు చేస్తున్నారు. కళ్ళు చెదిరిపోయే గొప్ప అందగత్తె కాదు కానీ టాలెంట్, యాక్టింగ్ రెండూ పుష్కలంగా ఉన్నాయని కాస్త సానబడితే తండ్రి పేరు నిలబెట్టేలా చేయొచ్చని ఆర్చీస్ సెట్ లో పెర్ఫార్మన్స్ ని చూసినవారు అంటున్నారు. శుభమా అని ఇంకా కాలు పెట్టకుండానే సుహానా ఖాన్ మీద ప్రచారం చూసి షారుఖ్ నిట్టూరుస్తాడో లేక ఏదైనా సర్ప్రైజ్ చెబుతాడేమో వేచి చూడాలి.
This post was last modified on November 7, 2023 9:37 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…