నెలల తరబడి మహేష్ బాబు అభిమానులు ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. గుంటూరు కారం మొదటి ఆడియో సింగల్ ని చెప్పిన డేట్, చెప్పిన టైంకి మిస్ కాకుండా రిలీజ్ చేశారు. గతంలో హారికా హాసిని సంస్థ నుంచి జరిగిన ఆలస్యానికి భిన్నంగా ఈసారి ఆన్ టైం మైంటైన్ చేశారు. మొన్నో ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ దీని అప్డేట్ ఇచ్చినప్పటి నుంచి మ్యూజిక్ లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూశారు. పైగా తమన్ మీద ఈ ప్రాజెక్టు విషయంలో ఒత్తిడి ఉంది. ట్యూన్ల మీద ఏవేవో ప్రచారాలు జరిగాయి. ఫైనల్ గా దమ్ మసాలా బిర్యానీ గుద్ది పారెయ్ గుంటూర్ని అంటూ వచ్చేసింది.
రామజోగయ్య శాస్త్రి సాహిత్యంలో మహేష్ పాత్ర ఎలివేషన్ ని ఓ రేంజ్ లో ఇచ్చారు. ఎవరీబడి మేక్ ఏ వే లీడర్ ఆన్ ది వే అంటూ ఇంగ్లీష్ లిరిక్స్ ని పొందుపరిచి క్రమంగా ఊర మాస్ తెలుగు పదాలతో నింపేశారు. హక్కులు ఎవరికో ఎందుకు ఇవ్వాలి, ఎవడికో లెక్కలు ఎందుకు చెప్పాలంటూ హీరో మనస్తత్వాన్ని ప్రతిమిబించేలా అణువణువూ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా సాగాయి. తమన్ బీట్స్ మరీ స్పెషల్ అని చెప్పలేకపోయినా చాలా క్యాచీగా ఉన్నాయి. ఒకప్పటి దూకుడు ఇన్స్ ట్రుమెంటేషన్ వినిపించింది. వినగా వినగా స్లో పాయిజన్ లా జనాల్లోకి వెళ్లడం ఖాయమే.
గాయకులు సంజిత్ హెగ్డే, జ్యోతి నూరన్ స్వరాలు హుషారుగా సాగిపోయాయి. ఇక విజువల్స్ సంగతి చూస్తే రెండు మూడు కీలక షాట్స్ తో పాటు సెట్స్ పై వర్కింగ్ స్టిల్స్ తో సరిపెట్టేశారు. ఈ పాటకు సంబంధించిన చిత్రీకరణ ఇంకా పూర్తి కాకపోవడంతో త్రివిక్రమ్ పుట్టినరోజుకి రిలీజ్ చేయాలన్న సంకల్పంతో ఇలా కానిచ్చేశారు. అయినా సరే మాస్ కి కావాల్సిన బీడీ బిట్స్ తో పాటు కుర్చీ మీద కూర్చుని మహేష్ ఇచ్చిన ఫోజులు బాగా వెళ్లేలా ఉన్నాయి. దీని స్థాయి ఎంతదాకా వెళ్తుందనేది ఇంకొద్ది రోజులు ఆగితే అర్థమవుతుంది. మొత్తానికి గుంటూరు కారం ప్రమోషన్స్ గ్రాండ్ గా సరైన కంటెంట్ తోనే మొదలైపోయాయి.
This post was last modified on November 7, 2023 7:00 pm
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…
మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…
నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…
యూత్ ఫుల్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుందని భావించిన 'ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్' ఇంకా ఫస్ట్ వీకెండ్ కాకుండానే ఎదురీదుతున్న…