Movie News

వ్యూహం సమస్య యాత్ర 2కి వస్తుందా

సమయానికి సెన్సార్ అయిపోయి ఉంటే రామ్ గోపాల్ వర్మ వ్యూహం ఈ శుక్రవారం విడుదలయ్యేది. రాజకీయ ప్రయోజనాలు స్పష్టంగా ఉన్న కారణంగా అభ్యంతరం తెలుపుతూ అధికారులు రివైజింగ్ కమిటీకి పంపిన సంగతి తెలిసిందే. దీన్ని కూడా వర్మ తేలికగా తీసుకుని సూర్యుణ్ణి ఎవరు ఆపలేరు లాంటి రొటీన్ డైలాగులు కొట్టేశారు కానీ ఫైనల్ గా ఏ నిర్ణయం వెలువడుతుందో చూడాలి. ఎంత సమర్ధించుకున్నా సరే వ్యూహం, ఆపై జనవరిలో రాబోయే శపథం రెండూ కూడా పొలిటికల్ అజెండాతో జగన్ ని సమర్ధిస్తూ, బాబు పవన్ లను గేలి చేసే విధంగా ఉన్నాయనేది ట్రైలర్ లోనే అర్థమైపోయింది.

నెక్స్ట్ యాత్ర 2 క్యూలో ఉంది. యాత్ర వైఎస్ఆర్ పాదయాత్రకు ముందు, తర్వాత జరిగిన పరిణామాలు ఆధారంగా చేసుకుని రూపొందిస్తే సీక్వెల్ లో ఆయన చనిపోవడం మొదలుపెట్టి జగన్ మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే దాకా జరిగిన సంఘటనలతో సాగుతుంది. దర్శకుడు మహి రాఘవ్ టేకింగ్, రైటింగ్ ని వర్మతో పోల్చడం రాంగవుతుంది కానీ కంటెంట్ పరంగా చూసుకుంటే యాత్ర 2 కూడా జగన్ ని ఒక సూపర్ పొలిటికల్ పవర్ గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నమే. ఆద్యంతం తన వ్యక్తిత్వాన్ని హైలైట్ చేస్తూ జనం ఆయన మీద ఎంతగా ఆరాధనభావం పెంచుకున్నారో చూపిస్తారు.

ఇందులోనూ ప్రతిపక్ష పార్టీల నాయకుల ప్రస్తావన, ఆయా పాత్రధారులు అన్నీ ఉంటాయి. సోనియా గాంధీకి పోలి ఉన్న లుక్ చూస్తే కాంగ్రెస్ గురించి చురకలు ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితే మహి రాఘవ్ ఇదంతా సెన్సిటివ్ గా చూపిస్తారు కానీ ఏపీ రాజకీయ వాతావరణం చాలా వేడిగా ఉన్న నేపథ్యంలో ఎవరైనా వివాదాలు లేవనెత్తితే సెన్సార్ దగ్గరో లేదా న్యాయస్థానం దగ్గరో ఇబ్బందులు ఎదురు కావొచ్చు. ఎవరో ఒకరు కోర్టుని ఆశ్రయిస్తే చిక్కులు రావొచ్చు. ఎందుకంటే యాత్ర 2లో వీడియో కంటెంట్ ని ప్రచారానికి వాడుకునే ఛాన్స్ ఉందనే అభ్యంతరాలు తలెత్తొచ్చుగా. 

This post was last modified on November 7, 2023 12:38 pm

Share

Recent Posts

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

5 minutes ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

13 minutes ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

1 hour ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

3 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

5 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

7 hours ago