Movie News

భాగమతి 2 మంచి ఆలోచనే కానీ

ఇవాళ స్వీటీ అనుష్క బర్త్ డే. కెరీర్ లో కొంత గ్యాప్ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో సూపర్ హిట్ కంబ్యాక్ ఇచ్చిన ఆనందం ఫ్యాన్స్ ని సంతోషపరిచింది. అయితే ఆ సినిమా ప్రమోషన్లలో ఎక్కడా కనిపించకపోవడం, చేసిన ఒక్క వీడియో ఇంటర్వ్యూని కూడా నాన్చి నాన్చి రాకుండా చేయడం కొంత నిరాశ పరిచినా ఫైనల్ గా బ్లాక్ బస్టర్ దక్కడం మాత్రం హ్యాపీనే. ఇదిలా ఉండగా అనుష్క యాభై సినిమాగా భాగమతి 2ని తీయాలని యువి క్రియేషన్స్ నిర్ణయించినట్టుగా వచ్చిన వార్త హాట్ టాపిక్ గా మారింది. అఫీషియల్ గా ఈ రోజు చెబుతారో లేదో కానీ చేయాలనే అంగీకరమైతే కుదిరిందట.

ఒకపక్క చిరంజీవి విశ్వంభరలో హీరోయిన్ గా ఎంపికయ్యిందనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడీ భాగమతి 2 ట్విస్టు రావడం ఊహించనిది. ఒకవేళ రెండు సమాంతరంగా చేస్తుందేమో తెలియదు. అయితే ప్రాక్టికల్ గా చూస్తే ఆ సినిమా భారీ విజయం సాధించిందే కానీ ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ తీసేంత క్రేజ్ దానికి లేదు. ఆ టైంలో ఉన్న ట్రెండ్ వేరు ఇప్పటి పరిస్థితులు వేరు. విరూపాక్ష, మా ఊరి పొలిమేర 2 సక్సెస్ లు చూశాక సీరియస్ హారర్ జానర్ పట్ల మళ్ళీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిందనే సంకేతం బాక్సాఫీస్ దగ్గర కనిపిస్తోంది. భాగమతి 2 ప్రేరణకు ఇది కూడా కారణం కావొచ్చు.

అప్పటికి ఇప్పటికి అనుష్క లుక్స్ లో మార్పు వచ్చింది. ఆ ఇబ్బంది వల్లే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టికి లైవ్ ఈవెంట్, ప్రెస్ మీట్లు పెట్టలేదనే కామెంట్లు ఆ మధ్య గట్టిగానే తిరిగాయి. మరి భాగమతి 2, విశ్వంభర నిజంగా చేసే పనైతే వాటి ఓపెనింగ్స్ కి వచ్చినప్పుడైనా అనుష్క కెమెరా ముందు కాసిన్ని కబుర్లు పంచుకుంటే బాగుంటుంది. మరి దర్శకుడు ఎవరంటే మాత్రం ప్రస్తుతానికి లీక్ లేదు. ఫస్ట్ పార్ట్ హ్యాండిల్ చేసిన అశోక్ కే ఇస్తారా లేదా చూడాలి. దాని తర్వాత ఆయన చేసిన రీమేక్ దుర్గామతి బాలీవుడ్ లో డిజాస్టర్ గా మిగిలింది. వేరే ప్యాన్ ఇండియా మూవీ ప్లాన్ చేసుకున్నారు కానీ ముందుకెళ్ళలేదు. 

This post was last modified on November 7, 2023 11:29 am

Share

Recent Posts

మల్టీస్టారర్ మూవీకి మర్చిపోలేని అవమానం

కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…

4 minutes ago

ఆంధ్రా ముద్దుబిడ్డ అనంత్ అంబానీ

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…

29 minutes ago

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

57 minutes ago

వివేకా కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు

వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…

1 hour ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

2 hours ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

5 hours ago