వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ కోసం నెలకొన్న తీవ్రమైన పోటీ గురించి తెలిసిందే. ‘గుంటూరు కారం’ లాంటి పెద్ద సినిమా సహా మొత్తం అరడజను సినిమాలు పండుగ బరిలో ఉన్నాయి. ఒకేసారి అన్ని సినిమాలను రిలీజ్ చేయడం అసాధ్యం అని తెలిసినా.. ఎవరికి వాళ్లు పంతం వీడట్లేదు. సంక్రాంతికే పక్కా సంక్రాంతికే పక్కా అని బల్లగుద్ది చెబుతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త ప్రోమోలతో రిలీజ్ డేట్లను ప్రకటిస్తున్నారు.
పండుగ రేసులో ఉన్న సినిమాల్లో ‘హనుమాన్’తో పాటు రవితేజ మూవీ ‘ఈగల్’ వాయిదా పడతాయని కొన్ని రోజుల కిందట ప్రచారం సాగింది. కానీ ఆయా టీమ్స్ ఆ ప్రచారాన్ని ఖండించాయి. సంక్రాంతి రిలీజ్‌ను ఖరారు చేస్తూ మళ్లీ ప్రకటనలు ఇచ్చాయి. తాజాగా ‘ఈగల్’ సినిమా టీం టీజర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది చూస్తే .జస్ట్ టీజర్ లాగా అనిపించట్లేదు. సంక్రాంతి రేసులో ఉన్న మిగతా సినిమాలకు హెచ్చరికలా కూడా కనిపిస్తోంది.
‘ఈగల్’ ఆషామాషీ సినిమా కాదని ఈ టీజర్ చూసిన వాళ్లకు అర్థమవుతోంది. కథ పరంగా కొత్తదనం కనిపిస్తోంది. రవితేజ నెవర్ బిఫోర్ పాత్ర చేసినట్లు కనిపిస్తోంది. తన లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయాయి. సినిమాను పీపుల్స్ మీడియా వాళ్లు చాలా పెద్ద బడ్జెట్ పెట్టే తీశారనిపిస్తోంది. దేశ విదేశాల్లోని భారీ లొకేషన్లలో షూట్ చేసినట్లున్నారు. ప్రొడక్షన్ క్వాలిటీ మామూలుగా లేదు.
యాక్షన్ సన్నివేశాలు భారీగా కనిపిస్తున్నాయి. టెక్నికల్‌గా సినిమాలో మంచి సౌండ్ ఉంటుందనిపిస్తోంది. కాస్టింగ్ కూడా ఆసక్తికరంగా ఉంది. మొత్తంగా ఒక హై స్టాండర్డ్ మూవీతో సంక్రాంతి రేసులో నిలుస్తున్నామని.. మిగతా వాళ్లు జాగ్రత్త అని ఈ టీజర్ ద్వారా ఒక వార్నింగ్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇంతకుముందు ‘సూర్య వెర్సస్ సూర్య’ సినిమా తీసిన సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రాన్ని రూపొందించాడు. జనవరి 13న ‘ఈగల్’ను ప్రేక్షకుల ముందుకు తేనున్నారు.
This post was last modified on November 7, 2023 9:33 am
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…