కవ్వించే అగ్ని పర్వతం ‘ఈగల్’

దసరా పండక్కు టైగర్ నాగేశ్వరరావుతో ఆశించిన ఫలితం అందుకోలేకపోయిన మాస్ మహారాజా రవితేజ ఎక్కువ గ్యాప్ తీసుకోవడం లేదు. రెండు నెలలు తిరగడం ఆలస్యం ఈగల్ రూపంలో థియేటర్లలో అడుగు పెట్టబోతున్నాడు. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ జనవరి 13 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. వాయిదా గురించి పలువార్తలు చక్కర్లు కొడుతున్నప్పటికీ నిర్మాతలు మాత్రం పండగకు పక్కా అని స్పష్టం చేశారు. ఇందులో రవితేజ చాలా విభిన్నమైన పాత్ర చేశారనే టాక్ ఆల్రెడీ ఉంది. ఇవాళ టీజర్ ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు.

అతనో విధ్వంసం. ఈగల్(రవితేజ)పేరుతోనే వ్యవహరిస్తారు. ఎక్కడో కారడవుల్లో తిరుగుతూ నీడకు సైతం దొరకనంత రహస్యంగా ఉనికి లేకుండా బ్రతుకుతుంటాడు. ఎవరైనా పట్టుకోవాలని ప్రయత్నిస్తే కొండ మీద లావాని ఒంటి మీదకు ఆహ్వానించినట్టే. ఊరి జనం దేవుడిగా భావించే ఈగల్ తో ఓ బృందానికి పని పడుతుంది. ఒక మిషన్ మీద కలిసేందుకు ప్రయత్నిస్తుంది. నిత్యం ప్రమాదాలతో సావాసం చేసే తన వెనుక పడుతున్నదెవరు, ఏ లక్ష్యం కోసం పని చేస్తున్నాడో తెలియాలంటే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే. స్టైలిష్ యాక్షన్ విజువల్స్ తో టీజర్ ఆకట్టుకునేలా ఉంది.

కాన్సెప్ట్ ని ఎక్కువ రివీల్ చేయకుండా, కథకు సంబంధించిన క్లూస్ ఇవ్వకుండా టీజర్ ని తెలివిగా కట్ చేశారు. అనుపమ పరమేశ్వరన్, అవసరాల శ్రీనివాస్, మధుబాల, వినయ్ వర్మ, నవదీప్ తదితర క్యాస్టింగ్ ని రివీల్ చేశారు. కోరమీసం, పంచెకట్టుతో రెండు చేతుల్లో మెషీన్ గన్లు పట్టుకుని రవితేజని చూపించిన సీన్ కొత్త అంచనాలు రేపుతోంది. కార్తీక్ తో పాటు కమిల్ పోల్కి, కర్మ్ చావ్లా ఛాయాగ్రహణం బాధ్యతలు నిర్వహించారు. డవ్ జాండ్ నేపధ్య సంగీతం కొత్త సౌండ్ లో ఉంది. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మట్ కి భిన్నంగా రవితేజ ఈసారి ఈగల్ తో సరికొత్తగా అలరించబోతున్నట్టు అర్థమైపోయింది

EAGLE Teaser | Ravi Teja | Anupama Parameswaran | Karthik Gattamneni | People Media Factory