చాలా కాలంగా మహేష్ బాబు తన సినిమాల్లో స్క్రీన్ మీద సిగరెట్లు తాగడం లేదు. దర్శకులు కూడా వీలైనంత వరకు ఇతర పాత్రలకు ఆ అలవాటు లేకుండా చూస్తున్నారు. కథ డిమాండ్ చేస్తే తప్ప. స్పైడర్ లో ఈ నియమాన్ని మరీ స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యారు. గుంటూరు కారంకు మాత్రం మహేష్ అన్ని మినహాయింపులు ఇచ్చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో మొదలుపెట్టి ఫస్ట్ సింగల్ అనౌన్స్ మెంట్ దాకా నోట్లో బీడీ ముక్కతో పొగ వదలకుండా సూపర్ స్టార్ కనిపించడం లేదు. అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏ రేంజ్ లో మాస్ చూపించాడో అర్థం చేసుకోవచ్చు. దీనికే ఫ్యాన్స్ ఊగిపోతున్నారు.
స్క్రీన్ సంగతి అలా ఉంటే బయట కూడా మహేష్ చాలా జోవియల్ గా మారిపోతున్నాడు. నిన్న రాత్రి ఎంఈఐఎల్ కంపెనీ కృష్ణారెడ్డి ఆహ్వానం మేరకు ఆయన క్లబ్ హౌస్ ఓపెనింగ్ కి హాజరైన మహేష్ అక్కడ వెంకటేష్ తో పాటు కలిసి కూర్చుని పేకాట ఆడుతున్న ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. చిన్నోడు పెద్దోడు కలిసి రచ్చ చేస్తున్నారంటూ అభిమానులు తెగ మురిసిపోతున్నారు. దీని మీద మీమ్స్ కూడా వచ్చేశాయి. ఇద్దరూ సరదాగా ఆడినా సరే ఇలాంటి దృశ్యాలు బయట అరుదుగా చూస్తాం కాబట్టి స్పెషల్ గా అనిపిస్తాయి. ఆరంజ్ టి షర్ట్ లో మహేష్ పిచ్చ యూత్ ఫుల్ గా ఉన్నాడు.
ఎన్నో బ్రేకులు పడినా ఆలస్యమైనా గుంటూరు కారం మాత్రం ఊహించిన దానికన్నా ఎక్కువ మాస్ తో వచ్చేలా ఉంది. ఇప్పటిదాకా త్రివిక్రమ్ ఏ సినిమాలోనూ వాడనంత కమర్షియల్ కంటెంట్ ఇందులో ఉంటుందని యూనిట్ సభ్యులు ఊరిస్తున్నారు. మొదటి పాట నవంబర్ 7 మంగళవారం విడుదల చేయబోతున్నారు. ఆల్రెడీ లీక్ ఆయిన లిరిక్స్ తోనే ప్రోమో కట్ చేసి తమన్ ఇవ్వబోయే ఆడియో ట్రీట్ కి శాంపిల్ గా వదిలారు. అన్నట్టు రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదు. జనవరి 12నే వస్తుందని తాజాగా వీడియోలో మరోసారి హైలైట్ చేయడంతో ముందుకు జరగడం అనుమానమే.
This post was last modified on November 5, 2023 4:58 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…