ఇంకా ఇరవై రోజులు దాటకుండానే లియో టీమ్ కి పైరసీ పిశాచాలు పెద్ద షాక్ ఇచ్చాయి. ఆన్లైన్ లో హెచ్డి ప్రింట్ వచ్చేసింది. మాములుగా విదేశాల్లో ఆపరేట్ చేసే కొన్ని ఓటిటి సంస్థలకు తమిళ నిర్మాతలు త్వరగా స్టీమింగ్ చేసుకునే వెసులుబాటు ఇస్తారు. కాకపోతే ఆ గ్యాప్ కనీసం మూడు వారాలైనా ఉంటుంది. కానీ లియోకు నాలుగో వారం టచ్ కాకుండానే ఇలా జరగడం చూసి విజయ్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. తెలుగు వెర్షన్ ఎప్పుడో చల్లబడిపోయింది కానీ తలపతి ఇమేజ్ పుణ్యమాని తమిళంలో ఇంకా కలెక్షన్లు వస్తున్నాయి. ఆరు వందల కోట్లు దాటేసిందని నిర్మాతలు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఇలా తమిళ ప్రింట్ ప్రత్యక్షం కావడం ఊహించని పరిమాణం. ఆ మధ్య జైలర్ కు ఇలాగే జరిగింది. దానికి ఏకంగా 4K ప్రింట్ వదిలి దిమ్మదిరిగి పోయేలా చేశారు. దెబ్బకు నిర్మాతలు ఆఘమేఘాల మీద అమెజాన్ ప్రైమ్ తో ముందస్తు ఒప్పందం చేసుకుని రన్ ఉండగానే అఫీషియల్ స్ట్రీమింగ్ ఇచ్చేశారు. ఇది మొదటిసారి కాదు. తమిళ సినిమాలకు చాలా సార్లు జరుగుతూనే వస్తోంది. అయినా సరే కోలీవుడ్ నిర్మాతలు మేలుకోవడం లేదు. సమస్యకు మూలం ఎక్కడో తెలుసుకోవడం లేదు. హిందీ, తెలుగు, కన్నడ చిత్రాలకు రాని సమస్య వాళ్లకు మాత్రమే వస్తోంది.
ఏదైనా ఇది తేలిగ్గా తీసిపారేసే విషయమైతే కాదు. సరే లియో హిట్ అయ్యింది కాబట్టి ఓకే. ఒకవేళ యావరేజ్ కంటెంట్ ఉన్న వాటికి వస్తే వచ్చే అరకొరా కలెక్షన్లు కూడా పడిపోయి నిర్మాత రోడ్డున పడతాడు. చట్టాలు కఠినంగా లేకపోవడం, విచ్చవిడిగా ప్రపంచం నలుమూలల రిలీజులు చేసేయడంతో పైరసీ ఎక్కడ జరుగుతోందో పసిగట్టడం కూడా కష్టంగా మారింది. ఎదురుగా ఆన్ లైన్ లింకులు కనిపిస్తున్నా సరే పూర్తిగా కట్టడి చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రొడ్యూసర్లు ఉన్నారంటే అంతకన్నా ట్రాజెడీ ఏముంటుంది. ఈ జాడ్యం మిగిలినవాళ్లకు పాకుండా ఏదోరకంగా నిర్మూలించడం చాలా అవసరం.
This post was last modified on November 3, 2023 11:06 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…