షారుఖ్ ఖాన్ సినిమా ‘డంకీ’ క్రిస్మస్ రిలీజ్ విషయంలో సందేహాలేమీ పెట్టుకోవాల్సిన పని లేదని తేలిపోయింది. ఆ విషయాన్ని ధ్రువీకరిస్తూ తాజాగా రిలీజ్ చేసిన టీజర్లో ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఈ టీజర్లో రాజ్ కుమార్ హిరాని మార్కు స్పష్టంగా కనిపించింది. వినోదానికి ఢోకా లేని సినిమాలాగే ఉంది ‘డంకీ’. కాబట్టి ‘డంకీ’ని మినిమం గ్యారెంటీ మూవీగా చెబుతున్నారు విశ్లేషకులు.
కాకపోతే ‘డంకీ’ని చూసి మరో క్రిస్మస్ సినిమా ‘సలార్’ భయపడాల్సిన పనైతే లేనట్లే ఉంది. ఎందుకంటే రాజ్ కుమార్ హిరాని మార్కు క్లాస్ ఎంటర్టైనర్లకు ఇప్పుడు అంతగా డిమాండ్ ఉండట్లేదు. ఇప్పుడంతా మాస్, యాక్షన్ సినిమాలదే హవా. హీరో ఎలివేషన్లు, భారీ యాక్షన్ ఘట్టాలు ఉన్న.. విజువల్‌గా ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమాలే భారీ వసూళ్లు రాబడుతున్నాయి.
షారుఖ్ ఖాన్ చివరి రెండు సినిమాలు ‘పఠాన్’; జవాన్’ కథ పరంగా వీక్ అయినా సరే.. పై అంశాలన్నీ ఉండటం వల్లే అవి ఘనవిజయం సాధించాయి. ప్రధానంగా ఉత్తరాది ప్రేక్షకులు ఇలాంటివి ఎక్కువ కోరుకుంటున్నారు. నార్త్ మాస్ ఏరియాల్లో ఇలాంటి సినిమాలే బాగా ఆడుతున్నాయి. మాస్ టచ్ ఉన్న ‘గదర్-2’కు అక్కడి జనం ఎలా బ్రహ్మరథం పట్టారో తెలిసిందే.
‘సలార్’ పక్కా మాస్, యాక్షన్ సినిమా కావడంతో ఉత్తరాదిన కూడా మాస్ ఏరియాల్లో ‘డంకీ’ మీద తిరుగులేని ఆధిపత్యం చలాయించే అవకాశముంది. ‘డంకీ’కి ఎంత మంచి టాక్ వచ్చినా మెట్రో సిటీల్లో, మల్టీప్లెక్సుల వరకు బాగా ఆడొచ్చు. కానీ మిగతా చోట్ల ‘సలార్’ దూకుడును తట్టుకోవడం కష్టమే. అదే సమయంలో ‘సలార్’ మెట్రో సిటీలు, మల్టీప్లెక్సుల్లోనూ గట్టి ప్రభావమే చూపే అవకాశముంది. ‘డంకీ’లో హీరోయిజం, యాక్షన్, మాస్ అంశాలు లేకపోవడంతో ‘సలార్’ టీంకు కచ్చితంగా ప్లస్ అనడంలో సందేహం లేదు.
This post was last modified on November 3, 2023 9:57 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…