Movie News

కార్తీ తెలుగు ప్రేమని మెచ్చుకోవాల్సిందే

మాములుగా తమిళ హీరోలు కొందరు తమ డబ్బింగ్ సినిమాలు పక్క రాష్ట్రంలో ఎంత బాగా ఆడుతున్నా కనీసం ఒక ప్రెస్ మీట్ కు వచ్చేందుకు కూడా ఇష్టపడరు. ముఖ్యంగా విజయ్, అజిత్ లాంటి వాళ్ళను ఈ క్యాటగిరీలో వేయొచ్చు. తలా అంటే ముందు నుంచి ప్రమోషన్లకు దూరం కాబట్టి ఏమో అనుకోవచ్చు. కానీ తలపతి అలా కాదు. దిల్ రాజు ఎంత ప్రయత్నించినా వారసుడు కోసం కనీసం ఒక సక్సెస్ మీట్ కి రప్పించలేకపోయాడు. లియోకి తీసుకొస్తానన్న నాగవంశీ బ్రేక్ ఈవెన్ జరిగి లాభాలు వచ్చినా సరే అదసలు గుర్తే లేదన్నట్టు విషయాన్ని సైడ్ ట్రాక్ చేశారు.

ఈ విషయంలో కార్తీని ప్రత్యేకంగా అభినందించాల్సిందే. దీపావళికి విడుదల కాబోతున్న జపాన్ తెలుగు వెర్షన్ పబ్లిసిటీ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ముందు రోజే భాగ్యనగరానికి చేరుకొని రేడియో, వెబ్ అండ్ ప్రింట్ మీడియా, సోషల్ ఇన్ఫ్లు యెన్సర్లు ఇలా ఒకటేమిటి అందిరితో విడివిడిగా మాట్లాడుతూ జపాన్ కంటెంట్ ని జనానికి చేరవేసేందుకు కష్టపడుతున్నాడు. ముందు నుంచి స్వంత డబ్బింగ్ చెప్పుకుంటున్న కార్తీ నాగార్జునతో కలిసి ఊపిరి చేయడం ఎంత ప్లస్ అయ్యిందో చూశాం. ఆ బాండింగే అన్నపూర్ణ స్టూడియోస్ సర్దార్, జపాన్ ల పంపిణీకి ముందుకొచ్చేలా చేసింది.

ఖైదీ నుంచి కార్తీకి ఫాలోయింగ్ పెరిగింది. దిల్లీగా చేసిన పెర్ఫార్మన్స్ మన ఆడియన్స్ ఫిదా అయ్యారు. పొన్నియిన్ సెల్వన్ మరీ విసుగు రాకుండా కాపాడింది ఎవరంటే వల్లవరాయగా చేసిన కార్తీనే, జపాన్ లో డిఫరెంట్ స్లాంగ్ తో కొత్తగా ట్రై చేసిన ఈ టాలెంటెడ్ హీరో కొంత మిమిక్రి టచ్ తో తెలుగులోనూ డబ్బింగ్ చెప్పడం విశేషం. తమిళంతో సమానంగా ఇక్కడి రిలీజ్ కు ప్రాధాన్యం ఇస్తున్న కార్తీ ఖైదీ 2 కోసం చాలా వెయిట్ చేయాలని చెబుతున్నాడు. జపాన్ కు జిగర్ తండా డబుల్ ఎక్స్, టైగర్ 3తో గట్టి పోటీ ఉన్నా ఏ మాత్రం నెరవకుండా గెలుపు మాదేనని కాన్ఫిడెన్స్ చూపిస్తోంది. చూడాలి మరి కార్తీ ఎలా మెప్పిస్తాడో. 

This post was last modified on November 2, 2023 6:40 pm

Share

Recent Posts

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

1 hour ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

3 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

3 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

3 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

3 hours ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

5 hours ago