ఈ శుక్రవారం రిలీజవుతున్న చిత్రాల్లో ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న సినిమా అంటే ‘కీడా కోలా’నే. ముఖ్యంగా యూత్ ఈ సినిమా కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. పెళ్ళిచూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాలతో ఆ వర్గం ప్రేక్షకులను దర్శకుడు తరుణ్ భాస్కర్ అంతగా ఆకట్టుకున్నాడు మరి. సినిమా సినిమాకూ చాలా గ్యాప్ తీసుకుంటున్న తరుణ్.. ఎట్టకేలకు ‘కీడా కోలా’ను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాడు.
ఇందులో స్టార్ కాస్ట్ ఏమీ లేదు. హీరో్ చైతన్య రావు జనాలకు పెద్దగా తెలియదు. ఈ చిత్రంలో హీరోయిన్ అంటూ ఎవరూ లేరు. కేవలం తరుణ్ భాస్కర్ పేరు చూసే యూత్ ఈ సినిమాకు వెళ్తున్నారు. ట్రైలర్ చూస్తే తన మార్కు స్పష్టంగా కనిపించింది. ఒక క్రేజీ, థ్రిల్లింగ్ రైడ్ చూడబోతున్న సంకేతాలు ఇచ్చింది. ఈ చిత్రంలో తరుణ్ నటుడిగా కూడా ఒక కీలక పాత్ర చేశాడు. తన పాత్ర కూడా క్రేజీగా ఉంటుందని అంటున్నారు.
‘కీడా కోలా’ ప్రమోషన్లను కూడా ఒంటి చేత్తో నడిపిస్తున్న తరుణ్ భాస్కర్.. తాజాగా రిలీజ్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘కీడా కోలా’లో లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం ఒక ముఖ్య పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆయన మీద తరుణ్‌కు విపరీతమైన అభిమానం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన్ని ఇమిటేట్ చేస్తూ ఒక ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేశాడు తరుణ్. దుబాయ్ శీను, అదుర్స్, నేనింతే సినిమాల్లో బ్రహ్మి చేసిన కల్ట్ కామెడీ క్యారెక్టర్లను అతను అనుకరించాడు. ఆయా వేషాల్లో ‘కీడా కోలా’ సినిమా గురించి పంచ్ డైలాగులు పేల్చాడు.
‘‘స్లోమోషన్లో బుల్లెట్లెల్లాలె.. వివేక్ సాగర్ మ్యూజిక్‌తో ర్యాంప్ ఆడించాలె.. ఐ నో ద పబ్లిక్ పల్స్.. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ పీపుల్’.. ‘‘నాకితే నాకార్లేరా.. సక్సెస్ అయితే అదే హ్యాపీ’’.. లాంటి డైలాగులు సందర్భానికి తగ్గట్లు భలేగా పేలాయి. ఇలా ఒక దర్శకుడు కమెడియన్ని ఇమిటేట్ చేస్తూ తన సినిమాను ప్రమోట్ చేసుకోవడం అరుదైన విషక్ష్ం. ‘కీడా కోలా’కు ఆల్రెడీ కొన్ని పెయిడ్ ప్రిమియర్స్ పడగా.. వాటికి మంచి టాకే వచ్చింది. తరుణ్ దర్శకుడిగానే కాక నటుడిగానూ అదరగొట్టాడని అంటున్నారు.
This post was last modified on November 2, 2023 6:18 pm
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…